భూముల కొత్త ధరలు ఫిక్స్- అమరావతి సహా, ఎక్కడ ఎంత..!!

ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 1) నుంచి మార్కెట్ ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, కొంత మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్ల కోసం రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం బారులు తీరు తున్నారు. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. కాగా, ప్రభుత్వం ఈ కొత్త ధరల గురించి స్పష్టత ఇచ్చింది. 5 నుంచి పది శాతం వరకు పెంపుదల ఉంటుంది. అమరావతి పరిధి లోని ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ఛార్జీల పెంపు
ఏపీ వ్యాప్తంగా భూముల మార్కెట్ ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన ధరల మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. డిమాండ్‌ బాగా ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు 20 శాతం వరకు పెరిగే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 5 నుంచి 10 శాతం వరకు పెంపు అమల్లోకి రానుం ది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కు ప్రస్తుత ఆర్దిక సంవత్సరం లో ఆదాయం లక్ష్యానికి దూరంగా ఉంది. దీంతో, చివరి రెండు నెలల్లో తాజా పెంపు నిర్ణయం ద్వారా పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Revised Land Registration charges implement from Feb 1st in AP Details here

పెరుగుతున్న రద్దీ
ఫిబ్రవరి 1 నుంచి ఛార్జీలు పెరగనుండటంతో ముందస్తుగానే రిజిస్ట్రేషన్ల కోసం జనం రిజిస్టార్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో, సర్వర్ల పైన ఒత్తిడి పెరిగి పలు ప్రాంతాల్లో మొరాయించాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్లలో అంతరాయం ఏర్పడింది. ఛార్జీలు పెరిగే లోగా తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ రోజు చివరి రోజు కావటంతో రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పాత ధరలతో భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ రోజు చివరి అవకాశం. దీంతో, రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పరిస్థితులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20 శాతం వరకు ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోనూ మార్పులు రానున్నాయి.

క్రమబద్దీకరణ
కాగా, రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నాయి. చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధి కంగా ఉన్నట్లు గుర్తించి.. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి పరిధి లోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఖజానాకు ఆదాయం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+