వరంగల్ రిషికేశ్వరి మృతి: ప్రిన్సిపల్ సస్పెన్షన్, పేరెంట్స్ అనుమానం
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టించిన రిషికేశ్వరి మృతి కేసులో ఒక ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ బాబురావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
మృతురాలి తండ్రి రుషికేశ్వరి ఉన్నప్పుడే సమస్యను ప్రిన్సిపల్ వద్దకు తీసుకెళ్లినా ఆయన సరిగా స్పందించలేదని ఆరోపించారు. ఆ కారణంగానే అధికారులు ఆయన పైన చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.
సస్పెన్షన్ పైన ఉన్నత విద్యాశాఖ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. మరోవైపు, రిషికేశ్వరి ఆత్మహత్య పైన పదిమందితో కూడిన నిజనిర్ధారణ కమిటీతో విచారణ జరుగుతోంది.

ఆత్మహత్య కాదు.. హత్య అని అనుమానం: తల్లిదండ్రులు
తమ కూతురు రిషికేశ్వరిది తాము హత్యగా అనుమానిస్తున్నామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. రిషికేశ్వరి మృతిపై ఏర్పాటు చేసిన కమిటీలో ప్రిన్సిపల్ బాబురావు ఉన్నారని, ఆ కమిటీ పైన తమకు నమ్మకం లేదన్నారు.
మా పాప ధైర్యవంతురాలని, ర్యాగింగ్ చేస్తే ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, అందుకే తమకు ఆత్మహత్య పైన అనుమానాలున్నాయని చెప్పారు. మగపిల్లల కంటే ఆడ పిల్లలే ఎక్కువగా ర్యాగింగ్ చేస్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రిన్సిపల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్నారు. తమ పాప విషయంలో ర్యాగింగ్ జరుగుతోందని ప్రిన్సిపల్ బాబురావుకు ముందే చెప్పామని, కానీ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ కేసులో ముద్దాయి బాబురావుకు రైట్ హ్యాండ్ అని తెలుస్తోందని, తేలాల్సి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications