RK Roja: ఎందుకు సిగ్గుపడాల ? వైసీపీ ఘోర పరాజయంపై ఆర్కే రోజా ట్వీట్..!

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన అధికార వైఎస్సార్సీపీ ఎవరూ ఊహలకు అందనంత దారుణంగా పరాజయం పాలైంది. అసెంబ్లీలో 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ తాజా ఎన్నికల్లో ఏకంగా 140 సీట్లు కోల్పోయి 11 సీట్లకు పరిమితమైంది. తద్వారా ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కించుకునే అవకాశం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేతలు రోజుకో విశ్లేషణ చేస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు.

ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై జరుగుతున్న విశ్లేషణలపై స్పందిస్తూ.. ఎందుకు సిగ్గుపడాలని రోజా ప్రశ్నించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని, మంచి చేసి ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాలని రోజా అడిగారు. కాబట్టి గౌరవంగా తలెత్తుకుని తిరుగుదాం అంటూ వైసీపీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అన్నారు. తద్వారా భవిష్యత్తులో వైసీపీ ఏం చేయాలో ఆమె ఒక్కమాటలో చెప్పేశారు.

rk roja justified ysrcp defeat reveals future course of action

ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఊహించని వారు సైతం నగరిలో రోజా ఓటమిని ఊహించారు. ఎన్నికల పోలింగ్ కు ముందే రోజా ఈసారి ఓడిపోతున్నట్లు పలు విశ్లేషణలు వచ్చేశాయి. పలు సర్వేలు కూడా ఇదే తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ఫలితాల వరకూ ఆగాల్సిన అవసరం లేకుండానే రోజా కూడా ఈసారి ఎన్నికల్ని లైట్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఫలితాల తర్వాత నగరి వైసీపీలో ఆమె ప్రత్యర్థి కేజే శాంతి మీడియా ముందుకొచ్చి రోజాపా తీవ్ర విమర్శలు కూడా చేశారు. కానీ రోజా మాత్రం అవేవీ పట్టనట్టుగానే ఇవాళ స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+