బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ .. లోకేష్ కాలర్ పట్టుకోవాలా..?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని, డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని చంద్రబాబు పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు.తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత అమలు చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.
విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు.అలాగని, కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేనని ఆయన స్పష్టం చేశారు. హామీల అమలుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా హామీల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర వాస్తవ అప్పులు రూ.4.6 లక్షల కోట్లు అని ప్రభుత్వమే తేల్చింది. మరి అలాంటప్పుడు సూపర్‌సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు? ఇది కచ్చితంగా సీఎం చంద్రబాబు అసమర్థతే అని రోజా విమర్శలు గుప్పించారు.సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు.
లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా? అంటూ రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్నింటికీ తన బాధ్యత అని చెప్పిన ఆయన, ఇప్పుడు తప్పించుకుంటే ఎలా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు.విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
3,900 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు.ఫీజ్ రియింబర్స్మెంట్తో పాటు అన్ని పథకాలు ఆపేశారని.. ఆరోగ్యశ్రీని నిలిపివేశారని మాజీ మంత్రి రోజా తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. అధికారంలోకి వచ్చాక.. బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ అని తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ పాలను మాజీ మంత్రి రోజా కొనియాడారు. కరోనా టైం లోనూ పథకాలు అమలు చేసినా ఘనత వైసీపీది అన్నారు. చంద్రబాబు అండ్ కో కు టైం దగ్గర పడిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications