ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో: ఏడుగురు మృతి
కర్నూలు: జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
ఏఎస్పీ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన ఏడుగురు తిరుమలకు స్కార్పియోలో బయలుదేరారు. పెద్దబోధనం సమీపంలోకి చేరుకోగానే డ్రైవరు కునుకు తీయటంతో వాహనం ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఐదుగురు వాహనంలో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందగా, కొనఊపిరితో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తి ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. కాగా, స్కార్పియో దూసుకెళ్లిన ఇంట్లోని కుటుంబసభ్యులు సురేంద్ర, నాగరాజు, బాలనాగమ్మలకు తీవ్రగాయాలయ్యాయి.
వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్పపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో నలుగురిని శేఖర్ ధావన్, నగేష్ కరాడే, చాగర్ బాలాచోరసల్, చివారే అక్షయ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications