హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పఠాన్‌కోట్ దాడి కనిపించలేదా: రాహుల్‌పై చెప్పు, 'దత్తాత్రేయని అరెస్ట్ చేయాలి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన పైన విశాఖలో ఇరువర్గాలు వేర్వేరుగా నిరసనలు తెలిపాయి. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ఏబీవీ, బిజెపి కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా, ఆత్మహత్య కారకులను శిక్షించాలని కొందరు విద్యార్థులు ధర్నా చేశారు.

కుల రాజకీయాలు చేసే నాయకులను బర్తరఫ్‌ చేయాలని బిజెపి యువమోర్చా, ఏబీవీపీ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉద్దేశించి డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ విశ్వవిద్యాలయంలో కుల రాజకీయాలకు తెరలేపింది రాహుల్‌ గాంధీయేనని ఆరోపించారు.

బుధవారం ఇసుకతోట కూడలి జాతీయర హదారిపై వారు ఆందోళన చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి, రాహుల్‌, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్‌ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీకి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.

 బిజెపి, ఏబీవీపీ ఆందోళన

బిజెపి, ఏబీవీపీ ఆందోళన

పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి తప్ప, అనుమతులు లేకుండా దిష్టిబొమ్మలను దహనం చేయకూడదని పోలీసులు నచ్చజెప్పారు.

 బిజెపి, ఏబీవీపీ ఆందోళన

బిజెపి, ఏబీవీపీ ఆందోళన

దీంతో రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో దళితుడు కాని వ్యక్తిని దళితుడిగా చిత్రీకరించి, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు చిచ్చురేపారని ఆరోపించారు.

బిజెపి, ఏబీవీపీ ఆందోళన

బిజెపి, ఏబీవీపీ ఆందోళన

ఆ పార్టీ నాయకుడు రాజయ్య తన కోడలిని, చిన్న పిల్లలను కాల్చి బూడిద చేసి హత్య చేసినప్పుడు ఈ రాహుల్‌గాందీ ఎక్కడున్నాడని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. పఠాన్‌కోట్‌లో తీవ్రవాదుల దాడిలో సైనికులు మృతి చెందినప్పుడు రాహుల్‌కు పరామర్శించే ఖాళీ లేకపోయిందన్నారు.

బిజెపి, ఏబీవీపీ ఆందోళన

బిజెపి, ఏబీవీపీ ఆందోళన

ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపారు. కాగా, ఆందోళన సందర్భంగా జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ఆందోళన

ఆందోళన

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని తక్షణం అరెస్టు చెయ్యాలని రాష్ట్ర విద్యార్థి జేఏసీ డిమాండ్‌ చేసింది.

ఆందోళన

ఆందోళన

ఈ మేరకు జేఏసీ నాయకులు బుధవారం ఆర్ట్స్‌ కళాశాల ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ... వర్సిటీలో వ్యవహారాలపై రాజకీయ నాయకుల ప్రమేయంతోనే దళిత విద్యార్థి బలయ్యాడన్నారు.

ఆందోళన

ఆందోళన

తక్షణమే కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హెచ్‌సీయూ వైస్ ఛాన్సులర్ ఆచార్య అప్పారావును అరెస్టు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాన్నారు.

ఆందోళన

ఆందోళన

బిజెపి నాయకుల పెత్తనంతో దళిత విద్యార్థి రోహిత్‌ బలైపోయాడని ఆరోపించారు. కారకులను అరెస్టు చేయకుంటే దేశవ్యాప్తంగా అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ దిష్టిబొమ్మను దహనం చేశారు.

English summary
Rohith suicide: BJP hits back at Rahul Gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X