అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజాకు మంత్రి పదవి పై క్లారిటీ : అంబటి - భూమన సైతం : సీఎం కొత్త లెక్కల్లో ఇలా....!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. తొలి విడత కేబినెట్ లో అనేక మంది సీనయర్లకు అవకాశం దక్కలేదు. దీంతో..రెండున్నారేళ్ల తరువాత ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిని 80 -90 శాతం వరకు మార్పులు ఉంటాయని..ఇతరులకు అవకాశం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అయితే, తాజాగా ఇదే అంశాన్ని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రస్తావిస్తూ సామాజిక సమీకరణాల కారణంగా నలుగురు అయిదుగురిని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేబినెట్ ఆశావాహులు చాలా మంది ఉన్నారని చెప్పారు. పార్టీ - ప్రభుత్వ పదవులను ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.

తొలి నుంచి అండగా ఉన్నవారికి...

తొలి నుంచి అండగా ఉన్నవారికి...

దీంతో..జగన్ రాజకీయంగా తొలి అడుగు వేసిన సమయం నుంచి ఆయనతోనే ఉన్న వారికి ఈ విడత అయినా మంత్రి పదవులు దక్కుతాయా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ, వస్తున్న సంకేతాలు..జరగుతున్న చర్చలతో అసలు కేబినెట్ ఎలా ఉండబోతోందునేది క్లారిటీ వస్తోంది. తొలి సారి మంత్రివర్గంలోనే స్థానం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగినా..చివరి నిమిషంలో ఫైర్ బ్రాండ్ .. నగరి ఎమ్మెల్యే రోజాకు ఛాన్స్ దక్క లేదు. ఆ తరువాత కొద్ది రోజులకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. రెండేళ్లతో ఆ పదవి ముగిసింది. ఇక, ఎన్నికల కోసం సిద్దం చేస్తున్న కేబినెట్ కావటంతో ఈ సారి సీనియర్లు.. పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి స్థానం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు కీలకంగా మారాయి.

రెడ్డి వర్గం నేతల నుంచే కాంపిటీషన్

రెడ్డి వర్గం నేతల నుంచే కాంపిటీషన్

అయితే, ప్రస్తుతం కొనసాగించే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో..ఈ సారి చిత్తూరు జిల్లా నుంచి ఆశలు పెట్టుకున్న రోజాతో పాటుగా భూమనకు అవకాశం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెడ్డి వర్గానికి ప్రస్తుత కేబినెట్ లో నాలుగు స్థానాలే ఉన్నాయి. ఈ సారి అదే సంఖ్యకు పరిమితం అవ్వనుంది. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డితో పాటుగా ఎస్సీ వర్గానికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. దీంతో...మరో రెడ్డి వర్గానికి చెందిన నేతకు ఛాన్స్ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే విధంగా నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఆనం రామనారాయణ రెడ్డి..వీరు సైతం కేబినెట్ లో బెర్తుల కోసం నిరీక్షిస్తున్నారు.

సీఎం జగన్ లెక్క పక్కా

సీఎం జగన్ లెక్క పక్కా

అయితే, మేకపాటి గౌతమ్ మరణంతో ఆ కుటుంబానికి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గౌతమ్ సతీమణి.. లేదా గౌతమ్ సోదరుల్లో ఎవరైనా ముందుకొచ్చి అంగీకరిస్తే..వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని .. లేకుంటే చంద్రశేఖర రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా జిల్లా నుంచి రెండో బెర్తు ఇప్పటి వరకు బీసీ వర్గానికి దక్కగా.. ఈ సారి ఎస్సీకి కేటాయిస్తారని చెబుతున్నారు. దీంతో..ఇక్కడ తొలి నుంచి జగన్ తో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి.. కాకాని గోవర్ధన్ రెడ్డి..ప్రతాప్ కుమార్ రెడ్డి వంటి వారిలో చివరి నిమిషంలో ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇక, మరో సీనియర్ నేత అంబటి రాంబాబుకు సైతం విస్తరణ సమయంలో ఖాయమనే ప్రచారం జరిగింది.

వారికి కొత్త బాధ్యతల పైన కసరత్తు

వారికి కొత్త బాధ్యతల పైన కసరత్తు

కానీ, ఇప్పుడు సమీకరణాల్లో భాగంగా కాపు వర్గానికి విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర నుంచి ఒక బెర్తు...రెండు గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు కాపు నేతలకు.. అదే విధంగా క్రిష్ణా జిల్లా నుంచి ఇక సీటు కేటాయించాల్సి ఉంది. కాపు నేతలకు అయిదో స్థానం కల్పిస్తేనే రాంబాబుకు ఛాన్స్ దక్కనుంది. అదే విధంగా అనంత వెంకటరామిరెడ్డి.. శ్రీకాంత్ రెడ్డి.. కాపు రామచంద్రారెడ్డి వంటి వారు రేసులో ఉన్నారు. కానీ, కేబినెట లో నాలుగు స్థానాలు మాత్రమే రెడ్డి వర్గానికి కొనసాగించే అవకాశం ఉంది. వారిలో పెద్దిరెడ్డి.. బుగ్గన.. మేకపాటి ఫ్యామిలీకి ఖాయమని చెబుతున్నారు. మరో స్థానం మాత్రమే ఉంది. అది.. గుంటూరు లేదా ప్రకాశం జిల్లా నుంచి భర్తీ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో..తొలి నుంచి జగన్ తో పాటుగానే నడుస్తూ...ఇప్పటికీ ఆయన విధేయులు ఉన్న సీనియర్లకు ప్రాంతీమ మండళ్ల ఛైర్మన్ల పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా అమలు చేసే కొత్త సమీకరణాలు..తీసుకోబోయే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

English summary
MLA Roja Bhumana and Ambati will have no chance in cabinet but will be given regional board chairman according to sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X