Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jabardasthలో రోజా పొలిటికల్ కామెంట్స్.. ఏకంగా ఆ మంత్రి శాఖపై..!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. జగన్ కు వీర విధేయురాలిగా..వైసీపీ లో కీలక నేతగా ఎదిగిన రోజా ఇప్పుడు కొత్తగా మంత్రి కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014, 2019 లో వరుసగా నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు వైసీపీ అధికారంలోకి వస్తూనే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగింది. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి వర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎస్సీ వర్గం నుంచి నారాయణ స్వామికి కేబినెట్ లో స్థానం దక్కింది. దీంతో..రోజా అప్పట్లోనే మనస్థాపానికి గురయ్యారు.

 రోజాకు నామినేటెడ్ పదవి లేకుండా..

రోజాకు నామినేటెడ్ పదవి లేకుండా..

దీంతో.. సీఎం జగన్ బుజ్జగించే ప్రయత్నం చేసారు. రోజాకు నామినేటెడ్ పదవి ఇస్తూ..ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించారు. అయితే, కొద్ది రోజుల క్రితం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దంటూ రోజాకు ఉన్న నామినేటెడ్ పదవిని సైతం రద్దు చేసారు. రోజాతో పాటుగా మరో ఇద్దరి ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు కోల్పోయారు. ఇక, ఇప్పుడు జగన్ మంత్రివర్గ విస్తరణ పైన భారీ ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో 90 శాతం వరకు మార్పులు ఉంటాయని గతంలో సీఎం జగన్ చెప్పగా..ఇప్పుడు కొందరిని తీసి మరి కొందరిని కొనసాగిస్తే సమస్యలు వస్తాయని భావిస్తూ..మొత్తంగా మార్పులు చేయాలనేది జగన్ ఆలోచనగా పార్టీలో ప్రచారం సాగుతోంది.

 మంత్రిగా రోజాకు పదవి ఖాయమా..

మంత్రిగా రోజాకు పదవి ఖాయమా..

అందులో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి పోటీ భారీగా ఉన్నా మహిళా నేత కావటం తో పాటుగా... మంత్రి పదవి ఇవ్వకపోవటంతో పార్టీలో వచ్చిన స్పందన-సానుభూతి కారణంగా రోజాకు ఈ సారి విస్తరణలో మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అయితే, చివరి నిమిషం వరకు జగన్ ఆలోచనలు-వ్యూహాలు అంతుచిక్కనవిగా ఉండటంతో పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక, జిల్లాలో రోజా తనకు వ్యతిరేకంగా కొందరు పని చేస్తున్నారనే అభిప్రాయం పలు మార్లు వ్యక్తం చేసారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవటం పైన ఓపెన్ గానే రోజా సీరియస్ అయ్యారు. సీఎంకు ఫిర్యాదు చేసారు. ఇక, జిల్లా కలెక్టర్ సైతం తనకు విలువ ఇవ్వటం లేదంటూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

 రోజాకు జిల్లాలో సొంత పార్టీలో సమస్యలు..

రోజాకు జిల్లాలో సొంత పార్టీలో సమస్యలు..

అయితే, జిల్లాలోని సీనియర్ నేతలే తమకు భవిష్యత్ లో పోటీ కాకూడదనే ఉద్దేశంతో రోజా మాట నెగ్గకుండా చేస్తున్నారనే చర్చ ఆమో అభిమానుల్లో వినిపస్తూ ఉంది. జిల్లా మంత్రులు ఇద్దరూ రోజాకు సహకరించటం లేదనే అభిప్రాయం జిల్లా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పుడు రోజా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగానూ చర్చకు కారణమవుతున్నాయి. రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే..జబర్దస్త్ లో ఫేమస్ అయ్యారు. ఆ షో లో న్యాయ నిర్ణేతగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.

 రోజా కామెంట్స్ షో కే పరిమితమా...

రోజా కామెంట్స్ షో కే పరిమితమా...

తాజాగా, ఆ షో నిర్వాహకులు వచ్చే వారం కార్యక్రమంకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. అందులో హైపర్ ఆది స్కిట్ లో రోజా చిన్న పాత్ర పోషిస్తారు. అందులో ఆది రోజాను ఉద్దేశించి అనసూయకు ఏ శాఖ కేటాయిస్తారని ప్రశ్నించగా..రోజా ఇచ్చిన సమాధానం ఒక్క సారిగా వైరల్ అవుతోంది. ఏముంది..అనసూయ - రష్మిలకు మైనింగ్ శాఖ ఇద్దాం... ఎప్పుడెప్పుడివో తవ్వుకుంటూ ఉంటారుగా అనటంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలోనూ చర్చ కు కారణమయ్యాయి.

రోజా వ్యాఖ్యలకు-రాజకీయాలకు లింకు ఉందా..

ఇన్ని శాఖలు ఉండగా..మైనింగ్ గురించి ప్రస్తావించటం అందునా..తన సొంత జిల్లాకే చెందిన మంత్రి ఆ శాఖ నిర్వహిస్తుండటం..ఆ మంత్రితో రోజా కు గతంలో ఉన్న అభిప్రాయ బేధాలు ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయనే చర్చ నడుమ ఈ వ్యాఖ్యలు చేసారా అంటూ జబర్దస్త్ కామెంట్స్ కు పొలిటికల్ కలర్ ఇస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రోజా ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు..తన మనసులోని మాటను జబర్దస్త్ వేదికగా రోజా ఇలా బయట పెట్టారా అంటూ పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి

Recommended Video

    YSRCP MLA Roja : డిశ్చార్జ్‌ తర్వాత తొలిసారి కనిపించి.. దుమ్మురేపాలని కోరిన రోజా VIDEO
     ఇదంతా షో లో భాగమే అంటున్న సన్నిహితులు..

    ఇదంతా షో లో భాగమే అంటున్న సన్నిహితులు..

    రోజా గతంలో టీడీపీలో ఉన్న సమయంలో నాటి కాంగ్రెస్ నేతల మీద విమర్శల దాడి చేసేవారు. ఆ తరువాత వైసీపీలోకి వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు-లోకేష్ మీద ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇక, ఇప్పుడు రోజా వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే, రోజా సన్నిహితులు మాత్రం ఇదంతా షో లో భాగంగా చేసిన వ్యాఖ్యలుగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+