జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడితే చెప్తాం: రోజా, 30 ఏళ్ల పాలనపై ట్విస్ట్

రేపు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి, జగన్‌ని కుర్చీలో కూర్చోబెడితే తాము ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామో మీరే చూస్తారని టిడిపి నేతలకు వైసిపి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.

అమరావతి: రేపు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి, జగన్‌ని కుర్చీలో కూర్చోబెడితే తాము ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామో మీరే చూస్తారని టిడిపి నేతలకు వైసిపి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.

ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీలో జగన్ ఇచ్చిన 9 హామీలు నెరవేరేవి కావని టిడిపి నేతలు చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏపీ మంత్రులు అందరూ వరుసగా తమ హామీలపై విమర్శలు చేశారన్నారు.

తాము ఆ హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రేపే చంద్రబాబు రాజీనామా చేస్తే, జగన్‌ను సీఎం చేస్తే అమలు చేసి చూపిస్తామన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తున్న టిడిపి నేతలకు మేం ఇచ్చిన హామీలపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఐదేళ్లలో పదిలక్షల కోట్ల బడ్జెట్ అవుతుందని చెప్పారు.

టిడిపి అబద్దపు హామీలు ఇచ్చిందన్నారు. దోచుకోండి.. దాడుకోండి అన్న రీతులో చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు పెడుతున్నారని విమర్శించారు. అలాంటి మీరా.. మహిళలను గౌరవించడం గురించి చెప్పేది అని ధ్వజమెత్తారు.

జగన్ అలా అనలేదని ట్విస్ట్

30 ఏళ్లు సీఎంగా ఉండాలనేది తన కోరిక అని జగన్ వ్యాఖ్యానించారు. అయితే రోజా మాత్రం అలా అనలేదని చెప్పారని తెలుస్తోంది. జగన్ ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటానని చెప్పలేదని, 30 ఏళ్లు గుర్తుంచుకునే పాలన అందిస్తానని మాత్రమే చెప్పారని తెలిపారు.

అక్కడే 9 హామీల లెక్క చెబుతాం

అక్కడే 9 హామీల లెక్క చెబుతాం

జగన్ ఇచ్చిన తొమ్మిది హామీలు ఎలా నెరవేరుతాయో క్లియర్‌గా లెక్కలతో పాటు చెప్పాలంటే అందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ అంటే ఓ గౌరవం, దానికి ఓ విలువ ఉంటాయని, అటువంటి ప్రదేశంలో అక్కడే తాము లెక్కలు చెబుతామన్నారు.

లోకేష్‌పై సెటైర్

లోకేష్‌పై సెటైర్

మనకూ ఓ పప్పు ఉన్నాడని, అతడిని చూస్తే తనకు కామెడీ యాక్టర్ గుర్తుకు వస్తాడని రోజా అన్నారు. ప్రతి దానికి సవాల్ విసరడం లోకేష్‌కు అలవాటుగా మారిందన్నారు. విశాఖ భూ కుంభకోణంలో సిబిఐ విచారణ జరిపిస్తే...చంద్రబాబు, లోకేష్, మంత్రులు ఎంత దోచుకున్నారో తేలుతుందన్నారు. అలా కాకుండా మీడియా ముందుకు వచ్చి తొడ కొడితే ఏం అవుతుందో అదే జరుగుతుందని మహేష్ బాబు సినిమాలోని డైలాగ్‌ను ఉద్దేశించారు.

అదీ చంద్రబాబు అనుభవం

అదీ చంద్రబాబు అనుభవం

పదో తరగతి పదిసార్లు రాసి ఫెయిలైతే పది సంవత్సరాల అనుభవం ఉన్నట్లు కాదని, ఆ అనుభవం ఎందుకూ పనికి రాదని రోజా అన్నారు. చంద్రబాబుది కూడా అలాంటి అనుభవమే అన్నారు. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారన్నారు. జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఓటుకు నోటు గురించి మాట్లాడితే స్పీకర్ కోడెల శివప్రసాద్ అస్సలు మాట్లాడనివ్వరని, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదని చెబుతారని, అదే జగన్ కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ గంటలు గంటలు మాట్లాడుతారన్నారు.

గౌరవం గురించి మాట్లాడుతారా

గౌరవం గురించి మాట్లాడుతారా

ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు తెరిచి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని రోజా మండిపడ్డారు. మహిళల ప్రాణాలు, మానాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదన్నారు. మహిళలను గౌరవించని టిడిపి నేతలు, మహిళల గురించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటున్నామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నారాయణ కాలేజీలో ఎంతోమంది విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అయినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+