ప్రచారంచేస్తూ సొమ్మసిల్లిన రోజా, పవన్‌పై రెచ్చిపోయారు
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, ప్రముఖ నటి, చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి రోజా శుక్రవారం సొమ్మసిల్లి పడిపోయారు. నియోజకవర్గంలో ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. మండుటెండలోను అభ్యర్థులు ఓట్ల కోసం తిరుగుతున్నారు. శుక్రవారం ప్రచారం నిర్వహిస్తుండగా రోజా ఏకాంబరకుప్పంలో సొమ్మసిల్లి పడిపోయారు.
ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఆమెకు వడ దెబ్బ తగిలింది. దీంతో ఆమె సొమ్మసిల్లారు. ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేశారు.

పవన్ కళ్యాణ్ పైన జగన్ పార్టీ అగ్గిమీద గుగ్గిలం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిప్పులు చెరిగింది. పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలను విమర్శించే అర్హత లేదన్నారు. వైయస్ పాలన గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలనన్ారు. వైయస్ గురించి పవన్ మాట్లాడుతున్నవన్నీ కారుకూతలు, పిచ్చిమాటలేనని మండిపడ్డారు.
జంగారెడ్డిగూడెంలో షర్మిల ప్రచారం
జగన్ సోదరి షర్మిల శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఒక్క అవకాశమిస్తే తన జీవితం మీ కోసం అంకితం చేసేందుకు తన సోదరుడు సిద్ధంగా ఉన్నారన్నారు. ఓదార్పు కోసం సోనియా ఇచ్చే పదవులను ఆయన వదులుకున్నారని చెప్పారు. జగన్‌కు విశ్వసనీయత, విలువలు ముఖ్యమన్నారు. చెయ్యని నేరానికి ఆయన జైలుకెళ్లారన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications