చేతకాని మంత్రి దేవినేని.., రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ పాలనా: రోజా
సొంత జిల్లా సమస్యలనే పరిష్కరించుకోలేని చేతకాని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పులివెందులకు నీరు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు రోజా.
విజయవాడ: కరువుకు-చంద్రబాబుకు ముడిపెట్టి వైసీపీ ఆరోపణలు చేయడం.. అవినీతికి-జగన్ కు ముడిపెట్టి టీడీపీ వాటిని తిప్పికొట్టడం ఏపీ రాజకీయాల్లో కామన్ గా మారిపోయింది. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అధికార టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల నుంచి జనం దృష్టి మరల్చేందుకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామలో వైసీపీ నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

చంద్రబాబు-కరువు కవల పిల్లలు అంటూ రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్ హయాంలో 90శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులనే.. అంతా తామే పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
సొంత జిల్లా సమస్యలనే పరిష్కరించుకోలేని చేతకాని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పులివెందులకు నీరు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు రోజా.












Click it and Unblock the Notifications