వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డంగా దొరికి నిస్సిగ్గుగా ప్రశ్నలా?: బాబుపై రోజా, పవన్ ఫ్యాన్స్ ఫోన్ చేశారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి స్టే తెచ్చుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా నిప్పు, నిజయితీ అంటూ వ్యాఖ్యానించే చంద్రబాబు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ ధ్వజమెత్తుతున్నారు.

ఓటుకు నోటు కేసు: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట

శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తన గొంతుని ఎలా రికార్డు చేస్తారంటూ నిసిగ్గుగా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పూ చేయకపోయినా అసెంబ్లీ నుంచి తనను ఏడాది సస్పెండ్ చేశారని అన్నారు.

Roja fires on chandrababu over cash for vote scam at eluru

శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా ప్రతినిధులను కొనాలని చూసి దొరికిపోయిన చంద్రబాబు, సిగ్గుపడాల్సింది పోయి, తన గొంతును ఎలా రికార్డు చేశారని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి తన గొంతును ఎందుకు రికార్డు చేశారన్న ప్రశ్నలోనే అది తన గొంతేనన్న సమాధానం కూడా ఉందని, ఆయనకు శిక్ష పడాలా? వద్దా? అన్నది కోర్టులే తేలుస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పూ చేయకపోయినా అసెంబ్లీ నుంచి తనను ఏడాది సస్పెండ్ చేశారని అన్నారు.

అడ్డంగా బుక్కయ్యారు: 'కేసు నుంచి బయటపడేందుకే సుజనాను ఢిల్లీకి పంపారు'

అలాంటప్పుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు శిక్ష పడాలా వద్దా? అని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను వదిలివేశారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మార్వో వనజాక్షిపై చేయి చేసుకున్న దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్‌ను శిక్షించాలని అన్నారు.

తన ఎమ్మెల్యేలు తప్పుల మీద తప్పులు చేస్తుంటే, చంద్రబాబు నిస్సిగ్గుగా, కోర్టుల అండతో తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం వైసీపీ రెండేళ్లుగా పోరాడుతోందని ఆమె చెప్పారు. 'పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కాదు, రబ్బర్ సింగ్ అని విమర్శిస్తేనే ప్రత్యేక హోదాపై తిరుపతిలో మాట్లాడారు. ఆయన ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి అభినందించారు. మీ వల్లే మా నాయకుడు ప్రత్యేక హోదాపై స్పందించారని' తనకు చెప్పారని ఆమె అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణేనని రోజా అన్నారు. రాష్ట్రంలో ప్యాకేజీల పాలనకు ఆయనే కారణమన్నారు. గతంలో పవన్ కళ్యాణే ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పారని, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని సభలు పెడుతున్నారని విమర్శించారు.

English summary
Ysrcp Mla Roja fires on chandrababu over cash for vote scam at eluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X