జగన్‌ది మాత్రమే, ఆ అలవాటు లేదు: సస్పెన్షన్‌పై పవన్ కళ్యాణ్‌కు రోజా
విజయవాడ: ప్రత్యేక హోదా పైన తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌ది మాత్రమే అసలైన పోరాటమని, మిగతా వారిది మోసమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. హోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి హోదాను తప్పనిసరిగా తీసుకురావాలని జగన్ ఒక్కరే పోరాడుతున్నారన్నారు. మిగతా పార్టీలన్నీ దాని పేరిట ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఆమె ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
'ప్రత్యేక' అడుగు: రంగంలోకి పవన్ కళ్యాణ్, పిలిచి చిక్కుల్లో పడ్డ జగన్!అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ తన నోరు అదుపులో లేదని చెబుతూ, అందుకే సస్పెండ్ చేశామని టిడిపి చెప్పుకుంటోందని, వాస్తవానికి తనకు ప్యాకేజీలు పుచ్చుకునే అలవాటు లేనందునే సస్పెండ్ చేశారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు.

ప్రజల వాదన వినిపించి సభ నుంచి గెంటివేయబడ్డందుకు తనకు సంతోషంగానే ఉందన్నారు. రోజా సస్పెన్షన్ పైన పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా మాత్రమే కావాలని, టిడిపి నేతలకు డబ్బుల కట్టలు అందించే ప్యాకేజీలేమీ తమకు వద్దన్నారు.
ప్రత్యేక హోదా పైన తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌ది మాత్రమే అసలైన పోరాటమని, మిగతా వారిది మోసమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. హోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications