రోజా తీవ్రవాది కన్నా డేంజర్, జగన్ కంట్రోల్ చేయడం లేదు: ఎమ్మెల్యే అనిత

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజాపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకారి అని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రోజాను ఎందుకు నియంత్రించడం లేదో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.

అసెంబ్లీలో తనపై చేసిన అసభ్య వ్యాఖ్యలకు రోజాపై పరువునష్టం దావా వేస్తున్నట్లు ఆమె బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయన్నారు. రోజాపై చర్యలు తీసుకోవాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోరినట్లు తెలిపారు.

 Roja ios dangerous than terrorist: MLA Anith

రోజా చేసిన వ్యాఖ్యల సీడీలు అధికారికంగా బయటకు విడుదల కావడంతో తన కుటుంబానికి తీవ్ర మనోవేదనను మిగిల్చాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి జరగవద్దనే ఉద్దేశ్యంతోనే రోజాపై పరువునష్టం దావా వేస్తున్నానని చెప్పారు.

రోజాపై రూ.కోటికి పరువునష్టం దావా వేస్తానని అందుకు సంబంధించిన నోటీసును రోజాకు పంపించినట్లు ఎమ్మెల్యే అనిత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+