రాయల్ బెంగాల్ టైగర్ ఇక లేదు..!
రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2018లో 11 ఏళ్ల వయస్సు ఉన్న ఈ పులిని బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.మృతి చెందిన టైగర్‌ను మధు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ టైగర్‌కు 11 సంవత్సరాలు.మృతి చెందిన టైగర్ వృద్ధాప్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

వృద్ధాప్యం వల్ల అనేక అవయవాలు పనిచేయకపోవడం, ఆహారం సరిగా తినకపోవడం వంటి కారణాల వల్ల మృతి చెందిందని జూ అధికారులు తెలిపారు.రెండేళ్ల నుంచి అనారోగ్యంగా ఉన్న ఈ పులిని సందర్శనకు ఉంచకుండా, ప్రత్యేక సెల్ లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు జూ క్యురేటర్ సెల్వం పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయల్ బెంగాల్ టైగర్ ఈరోజు మధ్యాహ్నం కన్నుమూసిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.












Click it and Unblock the Notifications