రూ. 1.5కోట్ల ఉపాధి నిధులు మాయం: పోస్ట్ మాస్టర్‌దే కీలక పాత్ర?
శ్రీకాకుళం: జిల్లాలోని గార పట్టణంలోని పోస్టఫీసులో ఉపాధి హామీ పనులకు సంబంధించిన రూ.1.5 కోట్ల నిధులు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది.
విషయం తెలిసిన వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్ గురువారం ఉదయం గార నగరానికి వచ్చి సబ్ పోస్ట్ మాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
పోస్టల్ ఉన్నతాధికారులందరూ గారకు వచ్చారు. పోస్టాఫీస్ తలుపులు మూసి రికార్డులు తనిఖీ చేశారు. మీడియా వాళ్లను లోపలికి అనుమతించలేదు. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన నిధులు రూ.1.5 కోట్ల రూపాయలు గల్లంతైనట్లు తేల్చారు. బినామీ పేర్లతో డ్రా చేసినట్లు తేలింది.
లభ్దిదారులు తమ డబ్బుల కోసం వెళ్తే ఇంతకు ముందే తీసుకున్నారని సమాధానం రావడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సబ్ పోస్ట్ మాస్టరే నిధులు నొక్కేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.

ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
చిత్తూరు జిల్లా నాగలాపురం పంచాయుతీరాజ్ ఏఈ ఈశ్వర్‌బాబు బుధవారం సాయుంత్రం రూ.25 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగలో హర్షవర్దన్‌ప్రసాద్ రూ.3.60 లక్షల విలువ చేసే చెక్‌డ్యాం పనులు చేశాడు.
ఇందుకు సంబంధించి రూ.2.2 లక్షల బిల్లు పొందాడు. మిగిలిన బిల్లును రెండో విడతగా పొందాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్ ఏఈ ఈశ్వరబాబు రూ.30 వేలు డివూండ్ చేయగా హర్షవర్ధన్‌ప్రసాద్ రూ.25 వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంతన్ బుధవారం సాయంత్రం దాడులు చేశారు. దాడుల్లో పట్టబడ్డ ఏఈ ఈశ్వర్‌బాబును నెల్లూరు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications