రైతు ఖాతాలోకి రూ. కోటి జమ: వెంటనే తీసేసుకున్నారు!

తన ఖాతాలో ఒకేసారి రూ. కోటి జమ కావడంతో కంగారుపడిన ఓ రైతు శుక్రవారం మీడియాకు ఆ విషయాన్ని తెలిపాడు.

కర్నూలు: పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లకుబేరులు, అక్రమార్కులు తమ నల్లధనాన్ని మార్చేందుకు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. పేదలు తీసుకున్న జన్ ధన్ ఖాతాలు, ఇతరుల పేదల ఖాతాల్లో తమ వద్ద ఉన్న నల్లడబ్బును జమ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంటున్నారు.

తన ఖాతాలో ఒకేసారి రూ. కోటి జమ కావడంతో కంగారుపడిన ఓ రైతు శుక్రవారం మీడియాకు ఆ విషయాన్ని తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెద్దకడబూరు గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు స్థానిక ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అయితే, ఇతని బ్యాంక్ ఖాతాలో డిసెంబర్ 24న రూ. కోటికి పైగా జమ అయింది.ఆ తర్వాత నుంచి ఆ మొత్తం డ్రా అవుతున్నట్లు అతని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి.

Rs. 1 Crore allegedly deposited in a farmers bank account

దీంతో కంగారుపడిపోయిన అబ్రహం తనకు తెలిసిన ఎమ్మిగనూరుకు చెందిన మల్లెల ఆల్‌ఫ్రెడ్ రాజుకు శుక్రవారం విషయాన్ని తెలిపాడు. కాగా, ఆల్‌ఫ్రెడ్ ఈ విషయాన్ని మీడియాకు తెలపడంతో వెలుగులోకి వచ్చింది. రైతు సెల్ నెం. 9989050379కు వస్తున్న మెసేజ్‌లను చూపించారు. ఇప్పటి వరకు 68 మెసేజ్ లు వచ్చాయని తెలిపారు.

30వ తేదీన ఉదయం పదకొండున్నరకు రూ.1,96,07,926 జమ అయినట్లు, ఆ తర్వాత సాయంత్రం ఐదున్నర తర్వాత నుంచి రూ. 1,33,48,781 డ్రాయి అయినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు. కాగా, ఈ నగదు ల్యాన్‌కో అమర్ కంటక్ పవర్ లిమిటెడ్ పేరున అబ్రహం అకౌంట్‌లో జమ అయిందని చెప్పారు. ఇదేదో భారీ మోసం ఉన్నట్లుందని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+