విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: నవ్యాంధ్రలో తొలిసారి భారీ సిఐఐ సదస్సు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సిఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు-2016 విశాఖపట్నంలో జరగబోతోంది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరిగే సదస్సుకు రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, గోద్రేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆది గోద్రేజ్, జిఎంఆర్ సంస్థల అధినేత జిఎం రావువంటి పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారు.

ఈ సదస్సును ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. కాగా, సిఐఐ గత 21ఏళ్లలో ఇటువంటి సదస్సులు దేశంలో 22నిర్వహించింది. ద్వితీయశ్రేణి నగరాల్లో తొలిసారిగా ఇంత భారీ సదస్సు విశాఖలో నిర్వహిస్తుండటం గమనార్హం.

సదస్సుకు దేశ విదేశాల నుంచి 1400 నుంచి 1500 మంది అతిథులు హాజరవుతున్నారు. ఇందులో 41 దేశాలకు చెందిన 300 మందికి పైగా ప్రతినిధులున్నారు. వివిధ దేశాలకు చెందిన మంత్రులు, సమ హోదా కలిగిన వారు సదస్సుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి, ఎనిమిది మంది కేంద్ర మంత్రులు సదస్సుకు హాజరవుతారు.

సదస్సులో 400 కంపెనీలు పరస్పర ఒప్పందాలు కుదర్చుకోనున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 100కు పైగా ఎంఓయులు కుదుర్చుకోనున్నామన్నారు. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సిఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు-2016 విశాఖపట్నంలో జరగబోతోంది.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరిగే సదస్సుకు రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, గోద్రేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆది గోద్రేజ్, జిఎంఆర్ సంస్థల అధినేత జిఎం రావువంటి పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ఈ సదస్సును ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు సంయుక్తంగా ప్రారంభించనున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

కాగా, సిఐఐ గత 21ఏళ్లలో ఇటువంటి సదస్సులు దేశంలో 22నిర్వహించింది. ద్వితీయశ్రేణి నగరాల్లో తొలిసారిగా ఇంత భారీ సదస్సు విశాఖలో నిర్వహిస్తుండటం గమనార్హం.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సదస్సుకు దేశ విదేశాల నుంచి 1400 నుంచి 1500 మంది అతిథులు హాజరవుతున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ఇందులో 41 దేశాలకు చెందిన 300 మందికి పైగా ప్రతినిధులున్నారు. వివిధ దేశాలకు చెందిన మంత్రులు, సమ హోదా కలిగిన వారు సదస్సుకు వస్తున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ముఖ్యమంత్రి, ఎనిమిది మంది కేంద్ర మంత్రులు సదస్సుకు హాజరవుతారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సదస్సులో 400 కంపెనీలు పరస్పర ఒప్పందాలు కుదర్చుకోనున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

100కు పైగా ఎంఓయులు కుదుర్చుకోనున్నామన్నారు. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ముఖ్యమైన కంపెనీలు కొన్ని ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

మౌలిక సదుపాయాలు, విద్యుత్, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉండడం వలన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంవైపు చూస్తున్నారన్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్న కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని రావత్ వివరించారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

మూడు రోజుల్లో కుదిరిన ప్రతి ఒప్పందం కూడా ఆచరణలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సదస్సులో గృహ నిర్మాణం, ఐటి, పర్యాటకం, విద్యుత్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయల రంగాలకు సంబంధించి ఎంఓయులు జరిగే అవకాశం ఉందన్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ఎంఓయులు మౌలిక సదుపాయాల రంగంలో 30 శాతం, మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 40 శాతం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కంపెనీలు వస్తే 50నుంచి 60 వేలమందికి ఉపాధి లభిస్తుంది.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

విశాఖను ఐటి హబ్‌గా తీర్చిదిద్దే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రావత్ చెప్పారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ఇందుకోసం సరైన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ కంట్రీ డైరక్టర్ (ఇండియా) తెరిస్సా ఖో హాజరుకానున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఫోర్బ్స్ మార్షల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ నౌషద్ ఫోర్బ్స్, నేపాల్ మంత్రి దీపక్ బోరా, సూడాన్ పారిశ్రామిక మంత్రి ఎం ఆలి హెచ్ రసూల్, వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సిఇఓ క్రిష్ అయ్యర్ హాజరవుతారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

ఫ్యూచర్ గ్రూప్ సిఇఓ కిషోర్ బియాని, ఆదిత్య బిర్లా గ్రూప్ సిఇఓ విశాక్ కుమార్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఇఓ కుమార్ రాజగోపాలన్ పాల్గొననున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ సలహాదారు ఫ్రాంక్ జి విస్నర్, రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కిశోర్ జయరామన్, ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్, ఐబిఎం ఇండియా సీనియర్ లీడర్ ప్రశాంత్ ప్రదాన్, తదితరులు హాజరవుతున్నారు.

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

సన్‌రైజ్ ఏపి-సిఐఐ సదస్సు

నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సిఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు-2016 విశాఖపట్నంలో జరగబోతోంది.

English summary
As the City of Destiny gears up to host the CII Partnership Summit 2016 commencing Sunday, the industry honchos are expecting a huge boost to the economy in the country, particularly Andhra Pradesh, as over 100 memorandam of understanding worth Rs 2 lakh crore are lined up for signing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X