వచ్చే ఎన్నికల్లో జరిగిదే, ఇదే కీలకం - పార్టీ నేతలకు సజ్జల అలర్ట్...!!

ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను వైసీపీ నాయకత్వం అప్రమత్తం చేస్తోంది. కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్నికల వేళ ఏం జరగనుందో స్పష్టత ఇచ్చింది. ప్రతీ ఒక్కరే అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించింది. ఇదే సమయంలో ప్రతీ నియోజకవర్గంలోనూ వై ఏపి నీడ్స్ వైయస్ జగన్ నిర్వహించాలని ఆదేశించింది. ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ లో భాగంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం కాబట్టి బూత్ లెవల్ ఏజంట్స్ ద్వారా తగిన కసరత్తు పూర్తిచేయాలని ఆదేశించింది.

జగనే మ‌ళ్లీ ముఖ్యమంత్రి
ఏపీలో జగన్ మ‌ళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రజలంతా కోరుకుంటున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పారదర్శకమైన పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా వైయస్ఆర్ సీపీ విజయం ఖాయమైందని, అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన కోరారు.

పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించే అంశంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

60 లక్షలకు పైగా దొంగఓట్లు
చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 60 లక్షలకు పైగా దొంగఓట్లను చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగించే విధంగా ప్రజాస్వామ్య పద్ధ‌తిలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. రానున్న ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైన అంశం కాబట్టి పూర్తిగా మనస్సు పెట్టి పనిచేయాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారని వివరించారు.

ajjala Ramakrishna Reddy

పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో బాధ్యతతో పనిచేయాలని అత్యధిక సమయం కేటాయించాలని కోరారు. శాసనసభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లకు సమన్వయం చేసి ఆయా నియోజకవర్గాలలో అందరూ ఐకమత్యంతో పనిచేసేలా చూడాలని సూచించారు. రానున్న సమయం అంతా ఎన్నికలకు సంబంధించి కాబట్టి వారికి హెల్ప్ ఫుల్ గా ఉండేలా వ్యవహరించాలన్నారు.

వై ఏపి నీడ్స్ వైయస్ జగన్
గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లకు బీమా సౌక‌ర్యం కల్పించడం జరుగుతుంద‌ని, దానికి సంబంధించిన సమాచారం కోరడం జరిగిందన్నారు. మిగిలిన వారు త్వరగా వారికి సంబం ధించిన సమాచారం పంపించాల‌ని సూచించారు.

ajjala Ramakrishna Reddy

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వై ఏపి నీడ్స్ వైయస్ జగన్ అనే అంశంపై సమావేశాలు నిర్వహిం చాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా 9 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో పార్టీ శ్రేణులంతా ప్రతిపక్షాల విమర్శలను ఎక్కడిక్కడ.. ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి వారి ఆరోపణలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+