జగన్‌తో రోజా.. సమంత తోడు?: బాబుకు సనా(పిక్చర్స్)
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆయా పార్టీల తరఫున పలువురు సినీ ప్రముఖులు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు. టిడిపి నుండి బాలకృష్ణ, మురళీ మోహన్, కవిత, సనా తదితరులు ఉన్నారు.
కాంగ్రెసు పార్టీ తరఫున చిరంజీవి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి బాబుమోహన్ తోడవుతున్నారు. బిజెపికి పెద్ద సంఖ్యలోనే గ్లామర్ ప్రచారకులు ఉన్నారని చెప్పవచ్చు.
పరోక్షంగా పవన్ కళ్యాణ్, నాగార్జునలు ఉండగా.. ప్రత్యక్షంగా కృష్ణం రాజు వంటి వారు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రోజా ప్రధానంగా కనిపిస్తున్నారు. అయితే రోజాకు సమంత తోడయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. సమంత జగన్ పార్టీకి ప్రచారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

సమంత
ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ రాజకీయ పార్టీలన్నీ సినిమా తారల వైపు తమ దృష్టి సారించాయి. వారితో ప్రచారం చేయిస్తే ఎంతో కొంత గెలుపు శాతం పెరిగే అవకాశం ఉండటంతో వీలైనంత మందిని రంగంలోకి దింపేందుకు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

సమంత
ఇప్పటికే పలువురు సినీ తారలు వివిధ పార్టీల్లో చేరి ఆయా పార్టీల తరుపున ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ లిస్టులో ఇపుడు సమంత పేరు కూడా వినిపిస్తోంది.

సమంత
తమ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకుగాను ఆ పార్టీ ఆమెకు భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్సార్కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో కోన రఘుపతి ఒకరు. కోన రఘుపతి కూతురు కోన నీరజ సమంత పర్సనల్ డ్రెస్ డిజైనర్‌గా పని చేస్తోంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కోన నీరజ సమంతను ప్రచారం చేయించడానికి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత
ఈ ప్రచారానికి గాను ఆమె రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి సమంత కేవలం ఒక కోన రఘుపతి తరుపున మాత్రమే ప్రచారం చేస్తుందా? లేక ఆ పార్టీ అభ్యర్థులందరి తరుపున వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

సమంత
అయితే ఒక అభ్యర్థికి కోటి రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం లేదని, పార్టీ మొత్తానికి ప్రచారం చేయడానికి ఆమెకు ఈ భారీ మొత్తం ఆఫర్ చేసి ఉంటారనే చర్చ సాగుతోంది.

రోజా
ప్రముఖ నటి రోజా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున చిత్తూరు జిల్లా నగరి నుండి పోటీ చేయనున్నారు. ఈ పార్టీకి ఆమె టాలీవుడ్ తరఫున ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.

చిరంజీవి
కాంగ్రెసు పార్టీ తరఫున సీమాంధ్రలో చిరంజీవి ప్రధాన ప్రచారకర్త. ఆయన ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రచార చీఫ్.

నాగార్జున - పవన్ కళ్యాణ్
బిజెపికి నాగార్జున ప్రచారం చేయక పోయినప్పటికీ, ఏ పార్టీకి సంబంధం లేనప్పటికీ ఇటీవల మోడీని కలవడం కొంత ఉపకరిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ మోడీకి ఓటేయాలని ప్రజలను కోరారు.

బాలకృష్ణ - జూ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీకి ప్రధాన గ్లామర్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు. బాలయ్య ప్రచారం చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అనేది అనుమానమే.

సనా
తెలుగదేశం పార్టీకు సినీ గ్లామర్ ఎక్కువగానే ఉంది. మురళీ మోహన్, కవితలు ప్రచారం చేయనున్నారు. రెండు రోజుల క్రితం పార్టీ తీర్థం పుచ్చుకున్న సన కూడా ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications