సంచైతపై సస్పెన్షన్ వేటు..!? వైసీపీలోకి రూట్ క్లియర్: ఢిల్లీకి నివేదిక..!

నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంచైత గజపతిరాజు పైన బీజేపీ చర్యలకు సిద్దమైంది. సంచైతను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర నాయకత్వానికి లేఖ రాసారు.

 కన్నా లేఖ

కన్నా లేఖ

గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంచైత తీరుతో పార్టీ ఇబ్బంది పడిందని..బీజేపీ అనుమతితోనే వైసీపీ ప్రభుత్వం ఆమెకు పదవులు కట్టబెట్టిందనే బావన ఏర్పడిందని కన్నా తన నివేదికలో పేర్కొన్నారు. సంచైత పైన సస్పెన్షన్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో సంచైత సైతం దీనిని ఊహించారని..అవరమైతే వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు కన్నా నివేదిక పైన బీజేపీ అధినాయయకత్వం తీసుకొనే చర్యలకు అనుగుణంగా..సంచైత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సంచైత వైసీపీలో చేరితే విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజు కుటుంబం పైన రాజకీయంగా వైసీపీ ఫిక్స్ చేసిన ట్రాప్ సక్సెస్ అయినట్లే.

 సంచితపైన సస్పెన్షన్ తప్పదా..

సంచితపైన సస్పెన్షన్ తప్పదా..

బీజేపీ యువమోర్చాలో జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్న సంచైత గజపతిరాజు పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా..అనుమతి లేకుండా మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్..సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవులను స్వీకరించటం పైన బీజేపీ సీరియస్ గా ఉంది. దీని పైన ఇప్పటికే బీజేపీ ఏపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్దపడే ఈ పదవులను స్వీకరించారని భావిస్తున్నారు. సంచైత నిర్ణ యాల కారణంగా పార్టీకి నష్టం కలిగేలా అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని నేతలు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ సంచైతకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో సీఎం జగన్ పైన ప్రశంసలు కురిపించటం కూడా బీజేపీ నేతలు సీరియస్ గా పరిగణిస్తున్నారు. దీంతో..సంచైత పైన సస్పెన్షన్ వేటు వేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు.

 ఇక, వైసీపీలోకి సంచైత..

ఇక, వైసీపీలోకి సంచైత..

సంచైత తనకు ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రయోజనం కలగటంతో..ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపించారు. సొంత పార్టీ బీజేపీ నేతల నుండి విమర్శలు వస్తున్నా..సంచైత వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా కనిపించటం లేదు. ఏపీ బీజేపీ ఇచ్చిన నోటీసు పైనా ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇక, ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు నేరుగా పార్టీ అధినాయకత్వానికి సంచైత పైన సస్పెన్షన్ వేటు వేయాలంటూ నివేదిక ఇచ్చారు. అయితే, ఒక రకంగా ఇప్పటికే సంచైత వైసీపీకి దగ్గరయ్యా

Recommended Video

    AP Local Body Polls : Watch TDP Leaders Met State Election Commissioner | Oneindia Telugu
    రాజకీయ భవిష్యత్తుపై సంచైత కీలక ప్రకటన

    రాజకీయ భవిష్యత్తుపై సంచైత కీలక ప్రకటన

    తమ కుటుంబానికి చెందిన సంస్థల్లో తనకు పదవులు దక్కటం పైన బీజేపీ నేతలకు సంబంధం లేదని అమె తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీకి అవసరమైతే వివరణ ఇస్తానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీలో చేరేందుకు సంచైత సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే వైసీపీ వ్యూహంలో భాగంగా..విజయనగరంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పైన పై చేయి సాధించినట్లుగా వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ వారంలోనే సంచైత తన రాజకీయ భవిష్యత్ పైన కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+