నారా లోకేష్‌తో రాకీ భాయ్ యష్ భేటీ - కథేంటీ: పాదయాత్ర నేపథ్యంలో..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- పాదయాత్రకు పూనుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్. దీనికోసం ఆయన సన్నద్ధమౌతోన్నారు.

గెలుపే లక్ష్యంగా..
ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానాన్ని మించిన స్థాయిలో ఇది ఉంటుందని టీడీపీ చెబుతోంది. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర చేయబోతోన్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటి వరకు ఈ పాదయాత్ర ద్వారా జనం మధ్యే ఉండనున్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య వైద్యం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారాయన.

యువత మద్దతు..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులందరూ దశలవారీగా నారా లోకేష్ వెంట పాదయాత్రలో నడిచే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో జిల్లా వారీగా పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందించుకుంటోన్నారు. యువతరాన్ని కదిలించేలా, పార్టీ వైపు మొగ్గు చూపేలా చరిత్రలో నిలిచిపోయేలా నారా లోకేష్ పాదయాత్ర ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తోన్నారు.

యష్ భేటీ..
ఈ పరిణామాల మధ్య- శాండల్‌వుడ్ సూపర్ స్టార్, కేజీఎఫ్ హీరో యష్ నారా లోకేష్‌ను కలుసుకున్నారు. సుమారు అరగంట పాటు మాట్లాడారు. రాజకీయాల్లో ఎప్పుడూ క్రియాశీలకంగా వ్యవహరించలేదు యష్. తన సొంత రాష్ట్రం కర్ణాటక రాజకీయాల్లో కూడా ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి నారా లోకేష్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సుమలత తరఫున..
2019 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం సుమలత తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దివంగత నటుడు అంబరీష్ మరణానంతరం సుమలత రాజకీయాల్లో ప్రవేశించారు. మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు బీజేపీ మద్దతును ప్రకటించింది. తన అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. అప్పట్లో సుమలత తరఫున యష్ విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు.. అది కేవలం అంబరీష్ కుటుంబం మీద ఉన్న అభిమానంతోనే. ఆ ఎన్నికల్లో సుమలత ఘన విజయం సాధించారు. లోక్‌సభలో అడుగు పెట్టారు.












Click it and Unblock the Notifications