సత్యం స్కాం: రామలింగ రాజు సహా అందరికీ బెయిల్
హైదరాబాద్: సత్యం రామలింగ రాజుకు బెయిల్ వచ్చింది. సత్యం కుంభకోణం కేసులో జైలులో రామలింగ రాజుతో పాటు ఈ కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష, మిగిలిన నిందితులు రూ.50వేలు ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కాగా, సత్యం కంపూటర్స్ కుంభకోణం కేసు దోషులు వారం రోజుల క్రితం హైదరాబాదులోని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషులుగా తేలి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు సహా ఇతరులు న్యాయస్థానంలో అఫీల్ దాఖలు చేశారు.

ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పును రద్దు చేయాలని వారు కోరారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పది మంది దోషులకు తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
హైదరాబాదులోని నాంపల్లి ఎంఎస్‌జె కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు వారికి సూచించింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలినవాళ్లంతా నాంపల్లిలోని కోర్టుకు వెళ్లారు. వారికి నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు వీరికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications