విజయవాడ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి, దేశ ప్రథమ మహిళ విజయవాడ నగరంలో మూడు గంటల పాటు పర్యటించారు. రాష్ట్రపతితోపాటు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సవిత కోవింద్, కుమార్తె స్వాతితో కలిసి విడిగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సవిత కోవింద్, స్వాతి కోవింద్ లకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆత్మీయ స్వాగతం పలికారు. స్వరాజ్ మైదాన్ లో పుష్ప ప్రదర్శనను సవిత కోవింద్ సందర్శించారు.బాలలు, మహిళలు ప్రథమ మహిళకు ఆహ్వానం పలికారు.
అనంతరం కనకదుర్గ ఆలయాన్ని సవిత కోవింద్ దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో ప్రథమ మహిళలకు స్వాగతం పలికిన వేదపండితులు సవిత కోవింద్, స్వాతి లకు ఆశీర్వచనం చేశారు.

.భవానీ ద్వీపంలో సవితా కోవింద్ ప్రధమ మహిళ సవితా కోవింద్ భవాని ద్వీపంలో గంటకు పైగా గడిపారు. హరిత బెర్మ్ పార్క్ నుంచి బోటులో సవితా కోవింద్ , స్వాతి కోవింద్ లను మంత్రి అఖిల ప్రియ భవానీ ద్వీపానికి తీసుకువెళ్ళారు. అక్కడ మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. అనంతరం నృత్యం, కోలాటం ప్రదర్శనలను సవితా కోవింద్ తిలకించారు.
దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా ఏపీ టూరిజం ప్రవేశపెట్టిన మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రథమ మహిళ ఆసక్తిగా చూశారు. భవాని ద్వీపం చాలా బాగుందని, ఇక్కడ పర్యాటకం ఎంతో ఆహ్లాదంగా ఉందని సవితా కోవింద్ కొనియాడారు. ఆమెకు సంప్రదాయ పద్దతిలో మంత్రి అఖిల ప్రియ పట్టు చీరలు, లడ్డులు, కజ్జికాయలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లా ఇతర అధికారులు పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!