వైఎస్ భారతిపై ఈడీ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు..!!

ఈడీ జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించేందుకు సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డికి అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు భారతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటీషన్ ను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

ఈ కేసులో మీరేం సవాలు చేశారో అర్దం కావటం లేదని ధర్మాసనం ఈడీ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తులను జప్తు పరిధిలోకి తీసుకురావటాన్ని సవాలు చేస్తున్నామని ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బుతో రూ 50 లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేస్తే...అనంతరం దాని విలువ రూ 5 కోట్లకు చేరినప్పుడు కేవలం రూ 50 లక్షల మేర నగదు డిపాజిట్లు సరిపోదనే అభిప్రాయం ధర్మానం ముందు వెలిబుచ్చారు.

YS Bharathi Reddy Supreme Court

ఎఫ్డీల విషయంలో షేర్ల ముఖ విలువ ఎలా నిర్ధారిస్తారు..షేర్ ధర ఎంతో ఎవరికీ తెలియదుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. భారతి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తమది ప్రవేటు కంపెనీ అని తెలిపారు. అక్రమార్జన లభ్యం కాకపోతే సాధారణంగా ఈడీ దానికి సమాన విలువైన ఆస్తులు జప్తు చేస్తుందని చెప్పారు.

ప్రస్తుతం జప్తు చేసిన షేర్లు అక్రమార్జన ద్వారా సంపాదించనవి కావని తెలిపారు. జప్తు చేసిన రోజు ఒక్కో షేర్ ముఖ విలువ రూ 10గా ఉందని ధర్మాసనం ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జప్తు చేసిన ఆస్తులు అక్రమార్జనవి కావని హైకోర్టు అభిప్రాయంతో ఈడీ విభేదించనందున పిటీషన్ లో జోక్యం చేసుకోవటానికి నిరాకరిస్తున్నామని ధర్మానం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+