నాందేడ్ నుంచి తిరుపతికి ఇక రెగ్యులర్ ట్రైన్, ఈ రైళ్లు ఇక - రూట్, షెడ్యూల్..!!

దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత కొనసాగుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ సర్వీసులతో పాటుగా డిమాండ్ ఉన్న మార్గాల్లో అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా నాందేడ్ నుంచి తిరుపతి నడుస్తున్న స్పెషల్ ట్రైన్ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కొన్ని ప్రత్యేక రైళ్లను వచ్చే మార్చి వరకు పొడిగిస్తూ ప్రకటన చేసారు.

తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ మీదుగా వెళ్లే నాందేడ్-తిరుపతి(07015), తిరుపతి-నాందేడ్(07016) ప్రత్యేక రైలు సర్వీసును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. రైలు సర్వీసు పొడిగించడంతో కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటేశ్వర స్వామి భక్తులకు ప్రయాణ అవస్థలు కొంత మేర తప్పనున్నాయి.

scr-announce-extension-of-nanded-to-tirupati-special-trin-as-passengers-demand

అదే విధంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్‌ రైళ్లను పొడిగించినట్టు అధికారులు తెలిపారు. చర్లపల్లి-కాకినాడ టౌన్‌ (07031) ప్రత్యేక రైలు ఈనెల 15, 22, సెప్టెంబర్‌ 2వ తేదీ(శుక్ర వారం)వరకు, కాకినాడ టౌన్‌-చర్లపల్లి(07032) ప్రత్యేక రైలు ఈనెల 17, 24, 31 తేదీ(ఆదివారం)వరకు, హెచ్‌ఎస్‌.నాందేడ్‌-తిరుపతి (07015) ప్రత్యేకరైలు (ప్రతి శనివారం) 2026 మార్చి 28వరకు, తిరుపతి-హెచ్‌ఎస్‌.నాందేడ్‌ (07016) ప్రత్యేక రైలు( ప్రతి ఆదివారం) మార్చి 29, 2026 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాన మార్గాల్లో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 54 ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి.

ఈ పొడిగింపులో భాగంగా కాచిగూడ-మధురై, తిరుపతి, నాగర్పోల్, హైదరాబాద్-కొల్లాం, హైదరాబాద్-కన్యాకుమారి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వీటిలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య 10 రైళ్లు, కాచిగూడ-నాగర్పోల్ రూట్‌లో 8 రైళ్లు, నాందేడ్-ధర్మవరం మధ్య 10 రైళ్లు ఉన్నాయి. ఇక..హైదరాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు ప్రతి శనివారం నడుస్తుంది. అలాగే, హైదరాబాద్-కన్యాకుమారి ప్రత్యేక రైలు అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+