బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ బాండ్లను ఏం చేద్దాం?

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా పెదవి విరిచారు.

చంద్రబాబు- పవన్ కల్యాణ్ మరోసారి మహిళలను మోసం చేశారని రోజా విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా సూపర్ చీట్స్‌గా మారిపోయిందని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లోనే చంద్రబాబు మోసం బయటపడిందని ధ్వజమెత్తారు.

Senior YSRCP leader Roja slams Chandrababu over Budget

19 నుంచి 59 సంవత్సరాల వయస్సున్న మహిళలందరికీ ప్రతి నెలా 1,500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని, దీనివల్ల ఏడాదికి 18,000 ఇచ్చినట్టవుతుందని గొప్పగా ప్రచారం చేసిన చంద్రబాబు- పవన్ కల్యాణ్.. దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయంచకపోవడం మోసం కాదా? రోజా ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగ యువతీ, యువకులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని, దీనికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి అయినా కేటాయించకపోవడం దగా కాదా? అని నిలదీశారు.

ఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మేనిఫెస్టోలో సైతం దీన్ని పొందుపరిచారని రోజా గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పథకానికి నిధులే ఇవ్వలేదని, ఇది మోసగించడం కాదా? అని చెప్పారు.

Senior YSRCP leader Roja slams Chandrababu over Budget

తల్లికి వందనం పథకానికి కేటాయించాల్సిన నిధుల్లో సగానికి పైగా కోత పెట్టారని రోజా మండిపడ్డారు. అలాగే- సంవత్సరానికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఈ ఏడాది రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టడం మోసం కిందికి రాదా అని రోజా నిలదీశారు.

50 సంవత్సరాలకే మహిళలకు పెన్షన్ ఇస్తాం అని ఎన్నికల్లో చెప్పి, ఓట్లు వేయించుకున్నారని, ఈ బడ్జెట్‌లో ఆ ప్రస్తావన ఏదీ అని చెప్పారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సహాయం ఇస్తామని, ఈ లెక్కన బడ్జెట్‌లో 10,000 కోట్ల రూపాయలను కేటాయించాల్సింది పోయి 4,500 కోట్ల రూపాయలే ఇవ్వడం రైతులను మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఓట్లెయించుకున్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ ఇంటింటికీ ఇచ్చిన బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ బాండ్లను ఇప్పుడు ఏం చేసుకోవాలని, ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలా అని రోజా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+