పగబట్టి ముగ్గురి హత్య: సీరియల్ కిల్లర్ అరెస్టు

 Serial killer arrested in Kadapa district
కడప: గత ఐదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఉన్మాది తోట వెంకటరమణను కడప స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం రాజంపేటలో ఆరెస్టు చేశారు. వరుసగా ముగ్గురిని హత్య చేశాడు. ఐదుగురిని చంపాలనే అతని లక్ష్యంలో మరో ఇద్దరు మిగిలారు. ఈ స్థితిలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని జీవీపురంలో ఐదేళ్ల క్రితం గ్రామపెద్దలు తోట సుబ్రమణ్యం, గబ్బి రామకృష్ణయ్య, వెంకటయ్య తదితరులు దాయాదుల తగాదాలో తోట వెంకటరమణ తల్లిదండ్రులకు గ్రామ బహిష్కరణ విధించారు. తల్లిని అవమాన పరచారు. దాడి చేసి కొట్టి, భూములను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో గ్రామ పెద్దలపై కక్ష పెంచుకున్న తోట వెంకటరమణ వారిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 2009 మార్చి 1వ తేదీ తోట నారాయణ నిద్రిస్తున్న మంచంపై పెట్రోల్ పోసి నిప్పుంటించాడు. అయితే నారాయణ స్థానంలో అతని తమ్ముడు బలయ్యాడు. పోలీసులు వెంకటరమణను అదుపులోకి తీసుకుని జైలుకు పంపగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రత్యర్థులను తుదముట్టించాలనే పగతో ఉన్మాదిగా మారాడు. 2012 జూన్ 20వ తేదీన గ్రామపెద్ద గబ్బి రామకృష్ణయ్య ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా కిటికీ ద్వారా నాటుతుపాకితో కాల్చి సమీప అడవుల్లోకి పరారయ్యాడు.

అప్పటి నుండి గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడమే గాక రోజుకు 30 నుండి 40 మంది పోలీసులు గ్రామ పరిసరాల్లోనూ, అటవీ ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టారు. ముందు చేసిన హత్యాయత్నం విఫలం కావడంతో ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ తోట సుబ్రమణ్యాన్ని పొలం వద్ద నాటుతుపాకితో కాల్చి చంపాడు. మృతుడు సుబ్రమణ్యం వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీ సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు.

తోట సుబ్రమణ్యాన్ని చంపిన తరువాత ఉన్మాది వెంకటరమణ, గబ్బి వెంకటయ్యకు సెల్‌ఫోన్ ద్వారా బెదిరించేవాడు. దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారులు ప్రత్యేక బృందం నెట్‌వర్క్ సహాయంతో రాజంపేట, కోడూరు, చిట్వేలి తదితర మండలాల్లో సెల్ టవర్ల ద్వారా సమాచారం సేకరించడం మొదలెట్టారు. ఈ క్రమంలో రాజంపేటలోని ఓ లాడ్జి నుంచి నిందితుడు ఫోన్‌లో మాట్లాడుతుండగా పోలీస్ బలగాలు ట్రాప్ చేసి పట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+