జగన్ సర్కార్ కు సీబీఐ షాక్-ఆ కేసులో ఐదుగురిపై ప్రాసిక్యూషన్ -ఛార్జిషీట్ కు హైకోర్టు అనుమతి
ఏపీలో అధికార వైసీపీ ఇప్పటికే పలు సీబీఐ కేసులు ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా కూడా సీఎం జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, పలువురు అధికారులు కూడా సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ ఛార్జిషీట్ల విచారణ వేగంగా సాగుతోంది. అదే సమయంలో గతంలో ఏపీ ప్రభుత్వంపై దాఖలైన ఓ కేసులో సీబీఐ తాజాగా హైకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబోతోంది. ఇందుకు హైకోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఇందులో సీబీఐ పేర్కొన్న అంశాలు జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బగా మారబోతున్నాయి.

వైసీపీపై సీబీఐ కేసులు
వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపై ఇప్పటికే సీబీఐ కేసులు నడుస్తున్నాయి. వీటిలో జగన్ అక్రమాస్తుల కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో పాటు ఏపీ హైకోర్టులోనూ పలు సీబీఐ కేసుల్ని వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీబీఐ ఎప్పుడెలా విరుచుకుపడుతుందో తెలియడం కష్టంగా మారింది. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో అంతా చూశారు. చివరికి రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేయడంతో జగన్, విజయసాయిరెడ్డి ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వంపై దాఖలైన ఓ కేసు మాత్రం ఏపీ హైకోర్టులో తాజాగా విచారణకు వచ్చింది.

వైజాగ్ డాక్టర్ సుధాకర్ కేసు
వైజాగ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్తీషియా నిపుణుడిగా సేవలు అందిస్తున్న క్రమంలో కరోనా రావడం, ప్రభుత్వం తగినన్ని మాస్కులు, ఇతర వైద్యసామాగ్రి ఇవ్వకపోవడంతో ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం, దీంతో ఆయనపై కేసులు పెట్టి వేధించడం, చివరికి రోడ్డుపై ఆయన్ను లాకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పించడం వంటి వరిణామాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించింది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతివాదిగా ఉన్న నేపథ్యంలో సీబీఐకి హైకోర్టు ఈ కేసు అప్పగించడం అప్పట్లో సంచలనం రేపింది. చివరికి ఈ విచారణ పూర్తి కాకుండానే డాక్టర్ సుధాకర్ ప్రాణాలు విడిచారు. దీంతో డాక్టర్ సుధాకర్ ను వేధించిన ఆరోపణలు జగన్ సర్కార్ ను వెంటాడుతున్నాయి.

సీబీఐ ఛార్జిషీట్
వైజాగ్ డాక్టర్ సుధాకర్ ను వేధించి ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ప్రతివాదిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అప్పట్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు డాక్టర్ సుధాకర్ పై చర్యలు తీసుకున్న, కేసులు నమోదు చేసిన, ఆయన్ను వేధించిన వారిపై దర్యాప్తు జరిపిన సీబీఐ.. ఈ మేరకు హైకోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు హైకోర్టు అనుమతి కోరింది. ఈ ఛార్జిషీట్ లో పలు కీలక విషయాలు ఉన్నట్లు సీబీఐ చెబుతోంది. అదే సమయంలో డాక్టర్ సుధాకర్ చావుకు కారకులుగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఐదుగురు అధికారుల పేర్లనూ సీబీఐ తన ఛార్జిషీట్ లో ప్రస్తావించింది. దీంతో ఈ ఛార్జిషీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

సీబీఐ ఛార్జిషీట్ దాఖలుకు హైకోర్టు అనుమతి
స్వయంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన వైజాగ్ డాక్టర్ తన చుట్టూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల వేధింపుల కారణంగానే చనిపోయినట్లు సీబీఐ తాజా ఛార్జిషీట్ లో నిర్దారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐ తయారు చేసిన ఛార్జిషీట్ ను దాఖలు చేసేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇందులో డాక్టర్ సుధాకర్ మరణానికి కారకులైన ఐదుగురు ప్రభుత్వ అధికారులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు సీబీఐ హైకోర్టుకు తెలిపింది. అలాగే వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా అనుమతి కోరతామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. దీంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సొంత అధికారులపై చర్యలు తీసుకుంటారా ?
తమ ప్రభుత్వంలోని ఐదుగురు అధికారులు తమ ఆదేశాల ప్రకారం డాక్టర్ సుధాకర్ ను వేధించినట్లు సీబీఐ చెప్తున్న నేపథ్యంలో వారిపై చర్యలకు జగన్ సర్కార్ సిద్దపడుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. సీబీఐ హైకోర్టుకు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే ఈ ఐదుగురు అధికారులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతోంది. ఇందులో శాభాపరమైన చర్యలతోపాటు ఇతర చర్యలూ ఉండే అవకాశముంది. అయితే తమ ఆదేశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్న అధికారుల్ని ఇప్పుడు శాఖాపరమైన చర్యలకు గురి చేస్తే వారు తిరిగి హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు పరిస్ధితి ఎలా ఉంటుందన్నది కూడా చర్చనీయాంశంగా మారబోతోంది.
Recommended Video

ప్రాసిక్యూషన్ కు జగన్ సర్కార్ అనుమతిస్తుందా ?
డాక్టర్ సుధాకర్ పై వేధింపుల కేసులో ఐదుగురు అధికారులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో పాటు వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరతామని కూడా సీబీఐ హైకోర్టుకు స్పష్టం చేసింది. అంటే ఈ ఐదుగురు అధికారుల్ని సీబీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించబోతోందన్న మాట. ఇందులో వారు చెప్పే విషయాల ఆధారంగా సీబీఐ హైకోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. అయితే ఈ ప్రాసిక్యూషన్ కు జగన్ సర్కార్ సీబీఐకి అనుమతి ఇస్తుందా , ఇవ్వకపోతే హైకోర్టు మళ్లీ జోక్యం చేసుకుని ఆదేశాలు ఇస్తుందా అన్న అంశాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. జగన్ సర్కార్ లోని ఐదుగురు కీలక అధికారులు డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటే అది మరో సంచలనంగా మారే అవకాశాలూ లేకపోలేదు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications