వైసీపీకి బొత్స మేనల్లుడి షాక్..! పార్టీకి గుడ్ బై- ఆ పార్టీలోకి?
ఏపీలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్రలో పార్టీ కీలక నేతగా ఉన్న శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasa Rao) ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన త్వరలో టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది. మజ్జి శీను నిర్ణయం వెనుక కీలక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బొత్స సత్యనారాయణ మేనల్లుడైన మజ్జి శ్రీను (చిన్న శ్రీను) కొంత కాలంగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి శీను పనిచేశారు. ఇప్పుడు ఆయన.. వైసీపీకి, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన పంపారు.

గతంలో విజయనగరం జడ్పీ ఛైర్మన్ గా పనిచేసిన మజ్జి శ్రీను .. తన కుమార్తెను త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ స్ధానం నుంచి నిలబెట్టేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బొత్స సత్యనారాయణ తాజాగా తన కుమార్తె అనూషను కూడా ఇదే స్ధానం నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన కూడా చేసారు. ఈ విషయంలోనూ వీరిద్దరికీ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీకి గుడ్ బై చెప్పేసిన మజ్జి శ్రీను .. త్వరలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయన కుమార్తెకు విజయనగరం జడ్పీ సీటుతో పాటు పలు కీలక హామీలు లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఉన్నట్లు సమాచారం.














Click it and Unblock the Notifications
