గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచారం ముఠా గుట్టురట్టు: మూడు జంటల అరెస్ట్

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని ఓ లాడ్జీపై పట్టణ పోలీసులు మెరుపు దాడులు చేసి పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: జిల్లా బాపట్ల పట్టణంలోని ఓ లాడ్జీపై పట్టణ పోలీసులు మెరుపు దాడులు చేసి పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. బావదేముని దేవాలయం సమీపంలో ఉన్న భావన లాడ్జీలో వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్ఐ రవిశంకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

ముందుగా లాడ్జి రెండో అంతస్తులోకి వెళ్లిన పోలీసులను చుసిన లాడ్జి నిర్వహుకులు మెదటి అంతస్తులో ఉన్న కొంతమంది విటులను హడావుడి గా బయటకు పంపించివేశారు.లాడ్జీలోని కొన్ని రూంలలో ఉన్న మూడు జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపైనా, లాడ్జి నిర్వహుకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అసోది వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

sex racket busted: three couple arrested

ఐస్ లోడు లారీ బోల్తా: ఒకరు మృతి,11 మందికి గాయాలు

నెల్లూరు: కావలి సమీపంలోని అలిగుంట క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐస్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన లారీ ఏలూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఘటన జరిగింది.

అయితే ప్రమాదానికి కారణం మాత్రం డ్రైవర్ నిద్రమత్తు వల్లే అంటున్నారు. క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.

45లక్షల విలువైన 850కేజీల గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్

విజయవాడ రామవరప్పాడు వద్ద గంజాయి తరలిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి చెన్నైకి తరలిస్తోన్న45 లక్షల విలువైన 850కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని తరలిస్తోన్న ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

English summary
sex racket busted in Guntur district and three couple arrested on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X