ఏ మొహంతో: పవన్‌పై షర్మిల, రెచ్చగొడ్తున్నావ్: గుత్తా

అనంతపురం/నల్గొండ: విభజనకు మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకొని మద్దతిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిల శుక్రవారం అన్నారు. సీమాంధ్రలో ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో ఎనిమిదిసార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పారు. బాబు రైతుల పైన కాల్పులు జరిపించిన విషయం మోడీకి తెలుసో, తెలియదో అని విమర్శించారు. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు చెప్పారని, అలాంచి చంద్రబాబును గెలిపించాలని మోడీ చెప్పే చందమామ కథలు వినేందుకు అమాయకులు లేరన్నారు.

Sharmila questions Pawan Kalyan

సీమాంధ్రుల గొంతు కోసి వాగ్ధానాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు విభజించిన రాష్ట్రాల్లో కనీసం విమానాశ్రయం కూడా లేదన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్ సిఎంగా వచ్చారని, ఆయన సమైక్యాంధ్రకు తూట్లు పొడిచారన్నారు.

నమ్మరు: మైసూరా

చంద్రబాబు నాయుడును సీమాంధ్ర ప్రజలు నమ్మరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసూరా రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపిలకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. సీమాంధ్రలో అధికారం తమదే అన్నారు. పవన్ మాటలను ప్రజలు వినడం లేదన్నారు.

అవగాహన లేదు: పవన్‌పై రాఘవులు

పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల పైన ఏమాత్రం అవగాహన లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌‍దే అధికారమని చెప్పారు. భారతీయ జనతా పార్టీతో జతకట్టి తెలుగుదేశం పార్టీ అపచారం చేసిందన్నారు.

రెచ్చగొడుతున్నారు: గుత్తా

పవన్ కళ్యాణ్ ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో శుక్రవారం అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. మోడీ, చంద్రబాబులు చీఫ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+