Shirdi : షిర్డీ సాయి భక్తులకు గుడ్ న్యూస్ - ఆంక్షలు ఎత్తివేత..!!

షిర్డీ సాయి భక్తులకు దేవస్థానం కీలక సమాచారం ఇచ్చింది. ఇప్పటి వరకు బాబాకు భక్తులు నేరుగా పూల దండలు...ప్రసాదం సమర్పించటం పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా సమయం నుంచి షిర్డీ ఆలయంలో భక్తులు నేరుగా పూలు..దండలు..ప్రసాదం సమర్పించే విధానం పైన నిషేధం అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంలా నుంచి భక్తులు భక్తితో బాబాకు పూలు, దండలు సమర్పిస్తూ..ప్రసాదం సమర్పిస్తూ ఉంటారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

షిర్డీ సాయిబాబాను దర్శించుకొనేందుకు వెళ్లే భక్తులు సాధారంణంగా పూలు, ప్రసాదం తీసుకెళ్లటం ఆనవాయితీ. కరోనా ప్రారంభ సమయంలో మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు భక్తుల దర్శనాలను షిర్డీ దేవాలయంలో నిలిపివేసారు. అదే సమయంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బాబాకు పుల దండలు, ప్రసాదం తీసుకురావటం పైన షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్టు ఆంక్షలు విధించింది. ఈ నిషేధం కారణంగా భారీగా నష్టపోయామంటూ సమీపంలో పూల సాగు చేస్తున్న రైతులు వాపోయారు. దాదాపు 400 ఎకరాల్లో ఈ పూల సాగు సాగుతోంది.

 shiridisai

కొద్ది నెలల క్రితం ఈ నిషేధం తొలిగించాలని కోరుతూ పూల రైతులు, వ్యాపారులు నిరసనకు దిగారు. దీంతో, ఈ అంశం పైన అధ్యయనం చేసిన నిర్ణయం తీసుకోవటానికి వీలుగా మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భక్తులతో పాటుగా వైద్య అధికారులు, వ్యాపారుల నుంచి సమాచారం సేకరించింది. ఆలయ పాలకవర్గం నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. దీంతో, గతంలో విధించిన ఆంక్షలకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 shiridisai

కమిటీ సిఫార్సుల మేరకు తిరిగి పాత పద్దతిలోనే భక్తుల నుంచి పూల దండలు, ప్రసాదం స్వీకరిస్తామని ప్రకటించింది. సాయి సంస్థాన్ తమ నిర్ణయాన్ని ఆమోదించాలని కోర్టులో సివిల్ దరఖాస్తును దాఖలు చేసి కోర్టు నుండి అనుమతి తీసుకుంది. ఇదే సమయంలో ఆలయ ప్రాంగణంలోనే పూలను భక్తులకు అందుబాటులో ఉంచనునున్నారు. అధిక ధరలకు విక్రయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని ద్వారా ఇప్పుడు భక్తులకు తక్కువ ధరలకే పూలు అందుబాటులోకి రావటంతో పాటుగా, స్వయంగా బాబాకు సమర్పించేకొనే వెసులుబాటు కలిగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+