జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న శివారెడ్డి
అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వ్యాపారవేత్త శివారెడ్డి.
అమరావతి: అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వ్యాపారవేత్త శివారెడ్డి.
జగన్ ధర్మవరం పర్యటన సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైసీపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేయాలని శివారెడ్డిని కోరారు.

అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని తెలిపారు. పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని శివారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications