తెలుసుకో: బీజేపీ, పవన్ కళ్యాణ్ 'ఉత్తరాది'పై మోహన్ బాబు గట్టి ఝలక్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వ్యవహారంపై బీజేపీ స్పందించింది. టిటిడి ఈవోగా ఉత్తరాధి ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శారదా పీఠాధిపతి స్వరూపనంద సరస్వతి తప్పుబట్టిన వి,యం తెలిసిందే.

బాబూ! సమాధానం చెప్పండి: టిటిడిపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

తెలుసుకొని మాట్లాడండి

తెలుసుకొని మాట్లాడండి

దీనిపై బీజేపీ నేత భానుప్రకాశ్ స్పందించారు. పవన్ కళ్యాణ్, స్వరూపనందలు టిటిడి యాక్ట్ తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. టిటిడి ఈవోగా హిందువును, ఐఏఎస్ చదివిన వారిని నియమించవచ్చునని చెప్పారు.

టిటిడి యాక్ట్ ఇదీ..

టిటిడి యాక్ట్ ఇదీ..

ఉత్తరాధి, దక్షిణాధి అంటూ పవన్ కళ్యాణ్ ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకు రావొద్దని చెప్పారు. టిటిడి యాక్ట్ చదివి తెలుసుకోవాలన్నారు. ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందన్నారు.

రాద్ధాంతం ఎందుకు?

రాద్ధాంతం ఎందుకు?

ఉత్తరాది వ్యక్తిని టిటిడి ఈవోగా చేయడంపై విమర్శలు సరికాదన్నారు. ఏదో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని నియమించినట్లుగా రాద్దాంతం ఏమిటని ప్రశ్నించారు. భారత రాష్ట్రపతిగా గతంలో నీలం సంజీవరెడ్డి ఎంపిక అయ్యారని, అలాంటప్పుడు టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమిస్తే తప్పేమిటన్నారు.

పవన్‌కు షాక్.. సింఘాల్‌ను మెచ్చుకున్న మోహన్ బాబు

పవన్‌కు షాక్.. సింఘాల్‌ను మెచ్చుకున్న మోహన్ బాబు

ఓ వైపు, అనిల్ సింఘాల్ నియామకంపై పవన్, స్వరూపనంద విమర్శలు చేయగా.. నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు మాత్రం మరోలా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు పవన్‌కు చేదు అని చెప్పవచ్చు. అనిల్ సింఘాల్ గతంలో తెలుగు రాష్ట్రాల కలెక్టర్‌గా పని చేశారని మోహన్ బాబు గుర్తు చేశారు. ఆయన నిజాయితీపరుడు అని, అంకితభావం కలిగిన వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తి టిటిడి ఈవోగా నియమించబడ్డారని, ఆయనకు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

వెంకటేశ్వర స్వామిని ఓ ప్రాంతానికో, ఓ భాషకో పరిమితం చేయడం సరికాదని మోహన్ బాబు అన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే సమస్య కాదన్నారు. సింఘాల్ సమర్థత కలిగిన అధికారి అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Bhanuprakash Reddy and Former MP Mohan Babu supported TTD EO Anil Kumar Singhal.
Please Wait while comments are loading...