వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ కు షాక్ . అమరావతి నిర్మాణానికి 2100 కోట్ల రుణ సాయం నిలిపివేసిన వరల్డ్ బ్యాంక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమరావతికి రుణం ఇచ్చేది లేదని స్పష్టీకరణ || World Bank Pulls Out Of Amaravati Construction Project

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని చెప్పిన ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్‌ ఊహించని షాకిచ్చింది. అమరావతి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు నుంచి వరల్డ్‌ బ్యాంక్‌ తప్పుకుంది. రాజధాని డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకువరల్డ్ బ్యాంకు అందిస్తామన్న రుణ సాయాన్ని నిలిపివేసింది. గతంలో రూ.2వేల 100 కోట్లు అందిస్తామంటూ ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్‌.. ఇప్పుడు ఆ నిధులు ఇవ్వటానికి వెనకడుగు వేసింది. ప్రపంచ బ్యాంక్ యూటర్న్ తీసుకోవడానికి సీఎం జగన్‌ వైఖరే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని నిర్మాణం జరగకూడదని వైసీపీ చేసిన రచ్చే ఇప్పుడు ఈ పరిస్థితి కారణం అని టీడీపీ భావిస్తుంది.

త్వరలో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర .. కండీషన్స్ అప్లై త్వరలో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర .. కండీషన్స్ అప్లై

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతికి ఎదురుదెబ్బ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతికి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతికి ఎదురుదెబ్బ తగిలింది, అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు 300 మిలియన్ డాలర్ల నిధులను ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ప్రపంచ బ్యాంక్ వెబ్‌సైట్ లో ప్రాజెక్ట్ యొక్క స్థితి విరమించుకున్నట్టు సూచిస్తుంది . మాజీ సిఎం కోరిన రుణంపై, అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని బ్యాంక్ పరిశీలిస్తోంది. అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇనిస్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇక క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ ఫెడరేషన్ నేతృత్వంలోని చాలా ఎన్జిఓలు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై పని చేసే వర్కింగ్ గ్రూప్, మానవ హక్కుల ఫోరం, ఆంధ్రప్రదేశ్, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్, మరియు ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ సెంటర్ రైతుల నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా రాజధానిని నిర్మించాలన్న మునుపటి తెలుగు దేశం పార్టీ (టిడిపి) పాలనను వ్యతిరేకిస్తూ, కృష్ణా నదీ తీరానికి సమీపంలో అభివృద్ధికి నిరసన తెలుపుతూ రాసిన లేఖల ప్రభావం ఇప్పుడు అమరావతి నిర్మాణానికి విఘాతం కలిగిస్తుంది.

బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీ నిర్ణయం ..తనిఖీలకు నో అన్న కేంద్రం

బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీ నిర్ణయం ..తనిఖీలకు నో అన్న కేంద్రం


ఇక మొన్నటి దాకా అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది కానీ ఆ లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించలేదు. కానీ కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది .ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది.

అమారావతి ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించిన వరల్డ్ బ్యాంకు

అమారావతి ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించిన వరల్డ్ బ్యాంకు

ఇక ఇదిలా సాగుతుండగా అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. అయితే దీనికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం రాలేదని సీఆర్డీఏ అధికారులు అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు సీఎం అయిన తర్వాత గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రజల నుంచి 34 వేల ఎకరాల భూములను సేకరించింది. భూసమీకరణపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ముందుగానే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూసేకరణ చేపట్టారని చంద్రబాబు మీద విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి తోడు రాజధాని భూములపై వరల్డ్ బ్యాంక్ కి పెద్దఎత్తున రైతుల పేరుతో ఈ-మెయిల్స్ కూడా వెళ్లాయి. ఈ మెయిల్స్ వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అప్పట్లో ప్రపంచ బ్యాంకుకి తెలిపింది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు. నిన్నటి వరకు ప్రాజెక్టు పైప్ లైన్ లో ఉన్నట్లు స్టేటస్ లో ఉండగా ....తాజాగా డ్రాప్ అయినట్లు చూపిస్తోంది.

అమరావతి నిర్మాణం విషయంలో సందిగ్ధంలో జగన్ సర్కార్ .. సాయం నిలిపివేసి వరల్డ్ బ్యాంకు షాక్

అమరావతి నిర్మాణం విషయంలో సందిగ్ధంలో జగన్ సర్కార్ .. సాయం నిలిపివేసి వరల్డ్ బ్యాంకు షాక్

అసలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 7200 కోట్ల రుణం కోసం సీఆర్‌డీఏ ప్రపంచబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. తొలి దశలో రూ. 3200 కోట్లు, రెండో దశలో రూ, 3200 కోట్లు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. తొలి దశ రుణం తీసుకొనేందుకు నాడు కేంద్రం కూడ అంగీకరించింది. బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో కొన్ని ప్రాధాన్య మౌలిక వసతుల కల్పన పనుల్ని సీఆర్‌డీఏ చేపట్టింది. అయితే ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నాయని రాజధానికి చెందిన కొందరు బ్యాంకు ఇన్స్‌పెక్షన్ ప్యానెల్‌కు 2017 మే 25న ఫిర్యాదు చేయటం , ఆ మేరకు ప్రపంచబ్యాంకు టీమ్ అమరావతికి వచ్చి ఇన్స్పెక్షన్ చెయ్యాలని చెప్పటంతో ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కు ఓకే చెప్పి నిధుల కోసం ప్రయత్నం చెయ్యాలా ? లేకా కేంద్రం మాట విని ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ విరమించుకోవాలా ? అన్న సందిగ్ధం లో ఉంది జగన్ సర్కార్ . ఈ సమయంలోనే వరల్డ్ బ్యాంకు షాకింగ్ వార్త చెప్పింది . అమరావతి నిర్మాణానికి 2100 కోట్ల రుణ సాయం నిలిపివేసినట్టు వరల్డ్ బ్యాంక్ తన వెబ్ సైట్ లో ప్రకటించింది .

English summary
The information was received from the Center and the World Bank in the wake of the Bank Inspection Panel's inspection of the capital structure. However, the state government has sent a letter to the Center asking for more time . But the Center will tell the state its decision in this regard The Center hopes that the World Bank Inspection Panel's inspection will be a new tradition and that it will be difficult for the country to look into all the World Bank funded projects. The Center seems to have been advising the state to withdraw its proposal for World Bank funds to build Amaravati.The Center is said to be raising funds to build capital through other means. But the idea of ​​fundraising from the World Bank has been called off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X