Sailajanath: శైలజానాథ్ పై రెండు పార్టీల గురి..అక్కడే డిసైడింగ్ ఫ్యాక్టర్..!
శింగనమల: మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ శింగనమల నుండి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. రఘువీరా రెడ్డి తర్వాత పీసీసీ పగ్గాలు చేపట్టిన శైలజానాథ్ పార్టీకి జవసత్వాలు అందించేందుకు తనవంతు కృషి చేశారు. రాష్ట్ర విభజన దెబ్బకు కుదేలైన కాంగ్రెస్ తోనే కంటిన్యూ అయితే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలోకి వెళ్తుందని భావించిన శైలజానాథ్ కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పోటీ పై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో రెండుసార్లు శైలజా నాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్ క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు.ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిపోవడం, కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడుచుపెట్టుకుపోవడం వరుసగా జరిగిపోయాయి.2014 ,2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు.అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు శైలజానాథ్ తీవ్రంగా ప్రయత్నించారు.

ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్ కార్పెట్ ఉన్నప్పటికీ.. అటు టీడీపీ, వైసీపీల నుండి సైతం ఆహ్వానం అందుతున్నట్టు సమాచారం.ఈ మేరకు ఆయా పార్టీల ముఖ్యనేతలు శైలజానాథ్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక రెండు ప్రధాన పార్టీలలోని ముఖ్య నాయకులు తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలుకుతూనే గెలిపించుకునే బాధ్యత తామే తీసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరో వైపు శైలజానాథ్ అభిమానులు, అనుచరులు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
శింగనమలలో ఉన్న సామాజిక సమీకరణాలు శైలజానాథ్‌కు అనుకూలించే అంశం. శైలజానాథ్ ఇండిపెండెంట్‌గా పోటీచేసినా.. రెండు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసే ఓట్ బ్యాంకును తనవైపు తిప్పుకోగలరు. దీంతో శైలజానాథ్ స్వతంత్రంగా పోటీ చేస్తే తమకు నష్టమనే అభిప్రాయంతో రెండు ప్రధాన పార్టీలున్నాయి. ఈ నేపథ్యంలో శైలజానాథ్‌ను బుజ్జగించి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
శైలజానాథ్‌ను ఢీకొట్టగలిగే బలమైన అభ్యర్థులు రెండు ప్రధాన పార్టీల్లో లేకపోవడంతో ఆ రెండు పార్టీలు శైలజానాథ్ వైపు చూస్తున్నాయి.అయితే శైలజానాథ్ ఎవరివైపు మొగ్గు చూపుతారు..లేక తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ మాజీ మంత్రి స్వంతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతారా అనేది ఇప్పుడు అనంత రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications