అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు బరువు పెట్టారని సింగపూర్ మంత్రి: బెజవాడ కేంద్రంగా.. మాస్టర్ ప్లాన్‌‌లో ఏముంది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చామని, దీనికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, తర్వాత నిర్మాణం జరుగుతుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను ఏపీ సీఎం చంద్రబాబుకు ఇచ్చిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం పాలుపంచుకుంటుందా అని ప్రశ్నిస్తే.. నిర్మాణానికి నిబంధనలు అనుమతిస్తే, అందుకు అనుగుణంగా పని చేసేందుకు అభ్యంతరం లేదన్నారు. అయితే, దానికి టెండర్లు పిలవడం, బిడ్లు వేయడం, అందులో నిలదొక్కుకోవడం వంటి కసరత్తు చాలా ఉంటుందన్నారు.

రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం పాలుపంచుకునే అవకాశం వస్తే పని చేసేందుకు అభ్యంతరం లేదని, కానీ అప్పుడే చెప్పడం సాధ్యం కాదన్నారు. తమకు అప్పగించిన బాధ్యతను (మాస్టర్ ప్లాన్) సమర్థవంతంగా పూర్తి చేశామన్నారు. చంద్రబాబు తమకు పెద్ద బాధ్యతనే అప్పగించారన్నారు.

చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతంగా పూర్తి చేశామన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. ప్రజలు, ప్రభుత్వం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేశామన్నారు.

నాలుగేళ్లలో దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కాగా, చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. కన్సార్టియం రాజధాని నిర్మాణం జరగాలని, కన్సార్టియంలో సింగపూర్, జపాన్, చైనా, జర్మనీ తదితర దేశాలు లేదా పెద్ద కంపెనీలు ఏవైనా ఉండొచ్చన్నారు.

Singapore ministers on AP capital city master plan

మాస్టర్ ప్లాన్‌లోని కొన్ని అంశాలు

రాజధానికి అనుసంధానిసతూ 7 కారిడార్లు
హైదరాబాదు నుండి మచిలీపట్నంకు కారిడార్
కృష్ణా నదిని ఆనుకొని రాజధాని నిర్మాణం
వాస్తు, శక్తి ఆధారంగా త్రికోణాకారంలో రాజధాని ప్రధానం కేంద్రం.
219 చ.కి.మీ. పరిధిలో రాజధాని బృహత్తర ప్రణాళిక
విజయవాడ నగరం కేంద్రంగా రాజధాని నిర్మాణం
135 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం అనుసంధానం
క్రికెట్ స్టేడియం సహా పలు అత్యాధునిక వసతులు
అన్ని నీటి వనరులు కృష్ణా నదికి అనుసంధానం
11.5 చ.కి.మీ. మేర నీటి అనుసంధానం
270 చ.కి.మీ. వైశాల్యంలో వాస్తుకు అనుగుణంగా రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన
రాజధాని చుట్టూ ఇండస్ర్టియల్‌ కారిడార్.
రాజధానిలో ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణం
155 కిలో మీటర్ల అనుబంధ రోడ్లు, 332 సబ్‌ అర్టిలరీ రోడ్ల. వీటన్నింటినీ కనెక్ట్‌ చేసేలా 324 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
27 కి.మీ. గ్రీన్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు
సీడ్‌ క్యాపిటల్‌ మధ్యన బ్రహ్మస్థాన్‌ పేరుతో పార్కు నిర్మాణం
127 కిలోమీటర్ల వరల్డ్‌ క్లాస్‌ ఎక్స్‌ప్రెస్‌, సెమీ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం
మోటారు వాహన రహిత జోన్ల ఏర్పాటు
కృష్ణా నది ముఖద్వారం వద్ద క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు

English summary
Singapore ministers on AP capital city master plan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X