కెసిఆర్ మెచ్చిన అధికారి: సిఎంలోకి స్మితా సబర్వాల్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెప్పు పొందిన అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కార్యాలయంలో తొలి నియామకం చేపట్టారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్‌ను ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం సత్వరమే అమల్లోకి వస్తుందని చెప్పారు. మెదక్ జిల్లా కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్‌కు అప్పగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా కోల్ ఇండియా మాజీ సీఎండీ నర్సింగరావును నియమించుకోవాలని కెసిఆర్ భావించారు. అయితే ఇంత వరకూ ఆయన రాజీనామాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించకపోవటంతో అధికారికంగా ఈ నియామకం ఇంకా జరగలేదు.
ప్రస్తుతం ఆయన సెలవులో కొనసాగుతూ అనధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు. మిగిలిన అధికారులదీ ఇదే పరిస్థితి. సాంకేతిక కారణాలతో సిఎం పేషీలోని ఉన్నతాధికారుల నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇంత వరకూ జారీ కాలేదు. అయితే తొలి నియామకం స్మితా సబర్వాల్‌తో ప్రారంభం అయినట్లు అయింది.












Click it and Unblock the Notifications