రెండో భార్య ఉందని పిల్లలతో కలిసి వాగులో దూకింది, ఆఫీసర్ అనసూయపై దాడి

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం జరిగింది. డొంకరాయి రిజర్వాయర్ సమీపంలోని వాగులో పడి తల్లీ, ఇద్దరు కూతుళ్లు కొట్టుకుపోయారు. కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇది జరిగింది. మూడు రోజుల క్రితం వీరు గల్లంతయ్యారు. మృతులు బాపునగర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.

కాగా, తన భర్తకు రెండో పెళ్లం ఉందని తెలిసి ఆమె వాగులోకి దూకిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరి మృతదేహాలు నీటిలో తేలియాడటం చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

తీరానికి చేరిన జాలర్లు

కాకినాడకు చెందిన ఏడుగురు జాలర్లు విశాఖ తీరానికి చేరుకున్నారు. బోటు దెబ్బతినడంతో దానిని సమద్రంలోనే వదిలి సురక్షితంగా తీరం చేరారు. సముద్రంలో 12 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు.

పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు

Smugglers attack on beat officer

ప్రకాశం జిల్లాలోని పొదలిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ దాడిలో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

బీట్ అధికారిణిపై స్మగ్లర్ల దాడి

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తూటికొండ అటవీ ప్రాంతంలో బీట్ అధికారిణి పైన స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. స్మగ్లర్లు చెట్లు నరుకుతుండగా బీట్ అధికారిణి అడ్డుకున్నారు. దీంతో వారు ఆమెపై దాడి చేసి పరారయ్యారు. ఆమెను రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పేరు అనసూయగా తెలుస్తోంది.

విశాఖ జిల్లాలో కానిస్టేబుల్ పైన దాడి

విశాఖ జిల్లా తగరపువలసలో సోమవారం రాత్రి తాగుబోతు వీరంగం సృష్టించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో భాగంగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించిన యువకుడు ఆ తర్వాత తన అక్కాచెల్లెళ్లు, బంధువులతో కలిసి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన దాడి చేశాడు. రక్షక్ వాహనాన్ని ధ్వంసం చేశారు.

ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ

సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. రాజమండ్రి రైల్వే గూడ్స్ యార్డులో విశాఖకు చెందిన సంతోష్ తన స్నేహితులతో కలిసి రాజమండ్రిలో పెళ్లికి హాజరయ్యాడు. తిరిగి విశాఖ వెళ్లేందుకు స్టేషన్ వచ్చాడు. ఈ సమయంలో అతను రైలింజన్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో హైటెన్షన్ వైరు తగిలి అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను గీతంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+