ఇంటికి చేరుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ(ఫోటోలు)
హైదరాబాద్: రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ చరిత తిరిగి నగరానికి చేరుకుంది. చివరకు ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. విశాఖపట్నంలో ఆమెను పోలీసులు కనుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే భవ్యశ్రీ విశాఖపట్నం వెళ్లినట్లు చెప్పిందని పోలీసులు చెప్పారు. భవ్యశ్రీతో ఏ విధమైన సమస్యలు లేవని భర్త కార్తిక్ చెప్పారు.
ఆదివారం మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కూకట్ పల్లి ఏసీపీ సాయి మనోహర్, కేపీహెచ్‌పీ సీఐ శ్రీకాంత్ గౌడ్, ఏస్‌ఐలు మహేష్, విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 9న అదృశ్యమైన సాప్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత కథ ఎట్టకేలకు కంచికి చేరింది.
ఇంతకు ముందు వార్తాకథనాల ప్రకారం - ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విశాఖపట్నం జిల్లా పాడేరు అతిథి గృహంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెప్పారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సైబరాబాద్ పోలీసులు పాడేరు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నట్లు, అయితే గదిలో పోలీసులకు ఆన్‌లో ఉన్న టీవీ కనిపించినట్లు, ఆమె మాత్రం కనిపించనట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది.
భవ్యశ్రీ అదృశ్యంపై మీడియాలో వార్తాకథనాలు ఎప్పటికప్పుడు విస్తృతంగా వస్తున్నాయి. వాటిని ఆమె తెలుసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడ్డారు. అయితే, భవ్యశ్రీ కేసు పురోగతిని పోలీసులు గోప్యంగా ఉంచుతూ వచ్చారు. మొత్తం ఐదు బృందాలను ఈ కేసు దర్యాప్తునకు నియమించారు. ఆ వివరాలను మాదాపూర్ ఉపకమిషనర్ కార్తికేయశర్మ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు.
శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్ టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు సోదాలు చేపట్టారు. అన్వరంలోని అన్ని లాడ్జీలు, దేవస్థానం వసతి గృహాల్లో తనిఖీలు చేశారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు అనుమానించారు.
కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు. హైటెక్‌సిటీలో గల ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్ సంస్థలో భ్యవశ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, డెల్ సంస్థలో కార్తీక్ చైతన్య హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన భవ్యశ్రీ అదృశ్యమైన విషయం తెలిసిందే.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
తన భార్య ఆచూకీని కనుగొనాల్సిందిగా పోలీసులకు కార్తీక్ చైతన్య లేఖ రాశారు. ఈ లేఖను మీరు ఈ ప్రక్క చిత్రంలో చూడొచ్చు.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
కార్తీక్ చైతన్య, భవ్యశ్రీ ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు. హైటెక్‌సిటీలో గల ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్ సంస్థలో భ్యవశ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, డెల్ సంస్థలో కార్తీక్ చైతన్య హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
గురువారం ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన భవ్యశ్రీ అదృశ్యమైన విషయం తెలిసిందే.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ చరిత తిరిగి నగరానికి చేరినట్లు తెలిసింది. భవ్యశ్రీతోపాటు మరో వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు, అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు సమాచారం.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
అయితే కూకట్‌పల్లి సీఐ శ్రీకాంత్‌గౌడ్ మాత్రం భవ్యశ్రీ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని చెప్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని, భవ్యశ్రీ క్షేమంగా తమ కుటుంబసభ్యుల చెంతకు చేరుకోవాలని కోరుకుంటున్నామని మీడియాతో అన్నారు.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విశాఖపట్నం జిల్లా పాడేరు అతిథి గృహంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సైబరాబాద్ పోలీసులు పాడేరు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నట్లు తెలుస్తుంది.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
అయితే గదిలో పోలీసులకు ఆన్‌లో ఉన్న టీవీ కనిపించినట్లు, ఆమె మాత్రం కనిపించనట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
భవ్యశ్రీ అదృశ్యంపై మీడియాలో వార్తాకథనాలు ఎప్పటికప్పుడు విస్తృతంగా వస్తున్నాయి. వాటిని ఆమె తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే, భవ్యశ్రీ కేసు పురోగతిని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

మిస్సైన భవ్యశ్రీ హైదరాబాద్‌కు చేరుకుందా?
శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్ టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు సోదాలు చేపట్టారు. అన్వరంలోని అన్ని లాడ్జీలు, దేవస్థానం వసతి గృహాల్లో తనిఖీలు చేశారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు అనుమానించారు. మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications