పవన్ కళ్యాణ్‌పై కేఈ కృష్ణమూర్తి తీవ్రవ్యాఖ్యలు: 'అందుకే జగన్‌కు జనసేనాని మద్దతు'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే ఓ గాలి అన్నారు. పవన్‌కు గాలి మాటలు మాట్లాడటం అలవాటుగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువకూడదన్నారు. ఆయన ఇతరులు ఇచ్చిన దానిని చెబుతున్నారన్నారు. గాలి వార్తలను నమ్మి వాటిని వల్లించడమే ఆయనకు తెలుసునని ఎద్దేవా చేశారు. స్వయంగా వివేకంతో విశ్లేషించే శక్తి లేని వ్యక్తి పవన్ అన్నారు. ఎవరో చెబితే అదే నిజం అనుకొని మాట్లాడుతారని మండిపడ్డారు.

రమణదీక్షితులుకు మద్దతు దారుణం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పైన తీవ్ర అభియోగాలు చేశారని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. రమణదీక్షితులుకు పవన్ మద్దతు పలకడం దారుణం అన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర తేలిపోతోందన్నారు. శ్రీవారి నగలపై ఇప్పటికే 2 కమిటీలు నివేదిక ఇచ్చాయన్నారు.

ట్విట్టర్ ద్వారా వేరేవాళ్లు ఆరోపణలు చేయిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత దుష్ప్రచారం చేస్తున్నారని కేఈ ధ్వజమెత్తారు. పవన్‌తో ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేనలు కలిసి వెళ్తాయని ఇప్పుడే చెప్పలేమన్నారు.

వరప్రసాద్ వ్యాఖ్యలపై పవన్ స్పష్టత ఇవ్వాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుపైన పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. ఎవరితో వెళ్లాలనే విషయమై పవన్ స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జగన్, పవన్ కళ్యాణ్‌లు కలిసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు.

అందుకే పవన్ మద్దతు కోరుతున్న జగన్
పవన్ కళ్యాణ్ అభివృద్ధికి సహకరిస్తారా లేదా అరాచకానికి అండగా ఉంటారా తేల్చి చెప్పారని బోండా ఉమ అన్నారు. జగన్ పాదయాత్రకు స్పందన ఉండటం లేదనే జనసేనాని మద్దతును వైసీపీ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కాగా, అంతకుముందు వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తమతో కలవాలనుకున్నది వాస్తవమేనని, ఆయన జగన్‌కు మద్దతిస్తానని చెప్పారని తెలిపారు. దీనిపై బోండా ప్రశ్నించారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications