తెగదెంపుల్లేవ్.. మిత్రపక్షంగా ఉంటూనే ప్రత్యేక హోదాపై పోరాటం : సోమిరెడ్డి
నెల్లూరు : ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరులో జరిగిన మినీ మహానాడులో ప్రత్యేక హోదా గురించి సోమిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదాపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కేంద్రం నుంచి ఇంతవరకు ఎలాంటి హామి లేదన్నారు. అయితే, బీజేపీతో తెగదెంపులకు వెళ్లే అవకాశం లేదని, మిత్రపక్షంగా కొనసాగుతూనే ప్రత్యేక హెదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు.

ప్రత్యేక హోదాపై మహానాడు వేదిక నుంచే మోడీకి ఓ విన్నపం తెలియజేశారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని కోరిన ఆయన ఇందుకోసం మోడీ మాట మీద నిలబడాలని కోరారు. నీతి నిజాయితీలకు కట్టుబడే మోడీ అయితేనే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందని సూచించారాయన. అలాగే కేంద్ర సంస్థల నుంచి నిధుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని దీన్ని కూడా పరిష్కారించాలని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ మాట్లాడారు.












Click it and Unblock the Notifications