జగన్ రెచ్చగొడ్తున్నారు, మోడీ పేరు చెప్పే దమ్ము లేదు: సోమిరెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక హోదా పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పే దమ్ము జగన్‌కు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
శుభకార్యాలంటే జగన్‌కు పడవా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గాడిదలను కాశారా అని ఆయన మండిపడ్డారు. నరేంద్ర మోడీని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత కాంగ్రెసు నాయకులకు లేదని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో తాము బిజెపితో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదాను సాధిస్తామని ఆయన చెప్పారు.
జగన్మోహన్‌రెడ్డి ఓ సైకో అనిస ఏపీకి పట్టిన సైతాన్ అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని కట్టాలా? వద్దా? ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులు వెళ్లాలా? వద్దా?, దీనిపై జగన్ వైఖరి తెలియజేయాలని ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు శైలజానాథ్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను కుక్కలతో పోల్చిన కేంద్రమంత్రి వీకేసింగ్‌పై చర్యలు తీసుకోనందుకు నిరసనగా 28న అంబేద్కర్ విగ్రహాల ఎదుట దీక్షలు చేయనున్నట్లు శైలజానాథ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications