పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేసి, కెసిఆర్ వద్ద పనిచేయ్: జగన్‌కు సోమిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో అధికారం పక్షం తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా పని చేస్తోందని ఆరోపించారు.
స్వప్రయోజనాలే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్.. తెలంగాణ సిఎం కెసిఆర్‌తో జతకట్టి తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. సర్దుబాటుకు స్వస్తి పలికి జగన్ తన పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి.. కెసిఆర్ కింద పనిచేస్తే బాగుంటుందని సోమిరెడ్డి అన్నారు.
సీమాంధ్రులను కించపర్చేలా వ్యాఖ్యానించడం తెలంగాణ సిఎం కెసిఆర్‌కు తగదని అన్నారు. తక్షణమే కెసిఆర్ తన భాష మార్చుకోవాలని సూచించారు. పట్టిసీమపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్ భాష మార్చుకోవాలి: పార్ధసారథి
అనంతపురం: తెలంగాణ సిఎం కేసీఆర్ తన భాష మార్చుకోవాలని ఎమ్మెల్యే పార్ధసారథి కోరారు. తాము నోరు తెరిస్తే భస్మం అవుతారని ఆయన హెచ్చరించారు. జగన్ రాయలసీమ ద్రోహి అన్నారు.
జగన్ పట్టిసీమను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమను ఎడారిగా మారాలని వైయస్ జగన్ కోరిక అని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో జగన్‌కు పుట్టగతులు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications