బాబు ప్రాణాలతో ఉండొద్దనే, ఈసీ నిర్ణయం భేష్: జగన్‌పై సోమిరెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం హర్షణీయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం హర్షణీయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు ప్రాణాలతో ఉండకూడదనేదే జగన్ కోరిక అని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా జగన్ అనర్హుడని మరో మంత్రి ఆదినారయణ రెడ్డి అన్నారు. జగన్ తీరుతో కడప జిల్లా పరువు పోతోందన్నారు.

అంతకుముందు యనమల కూడా జగన్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌పై వెంటనే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని యనమల అన్నారు. జగన్‌లో ఉన్న క్రూరత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అర్థం చేసుకుందన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క్రూరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎన్నికల పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications