మన్మోహన్ కమిటీయే తేల్చింది: హోదాపై బాంబు, 'జగన్ పార్ట్‌టైమ్'

కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని బిజెపి నేత సోము వీర్రాజు మంగళవారం మండిపడ్డారు. ఈ సమయంలో ఆయన ఓ బాంబు కూడా పేల్చారు.

కడప: కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని బిజెపి నేత సోము వీర్రాజు మంగళవారం మండిపడ్డారు. ఈ సమయంలో ఆయన ఓ బాంబు కూడా పేల్చారు.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం లేదని గతంలో మన్మోహన్ సింగ్ వేసిన కమిటీ తేల్చిందని ఆసక్తికర విషయం చెప్పారు. అందుకే హోదా రాలేదని చెప్పారు.'

Somu Veerraju reveals why Special Status not getting AP

హోదా వల్ల రాష్ట్రానికి వచ్చేది రూ.2,500 కోట్లు మాత్రమేనని, అదే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ద్వారా ఏపీకి రూ.2.30 లక్షల కోట్లు వస్తాయని సోము వీర్రాజు చెప్పారు.

రాహుల్ గాంధీ గుంటూరు సభ ప్లాప్ షో అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు అయిదు నిమిషాల్లో విభజన బిల్లును ఆమోదించారన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.

జగన్ పార్ట్ టైమ్ పొలిటీషయన్: జవహర్

వైసిపి అధినేత జగన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని మంత్రి జవహర్ అన్నారు. ఆయన వారంలో రెండు రోజులకు ఓసారి మాత్రమే బయటకు వస్తారని ఎద్దేవా చేశారు.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే మద్యం షాపులు అని చెప్పారు. కల్తీ మద్యం ఉంటే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. 200 మందిపై కేసు పెట్టినట్లు తెలిపారు. మద్యం వల్ల రూ.13 కోట్లకు పైగా ఈ ఏడాది ఆదాయం వచ్చినట్లు చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో బీర్ పార్లర్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+