తండ్రితో పాటు సవతి తల్లిని భార్యతో కలిసి చంపిన కుమారుడు
వరంగల్: వరంగల్ జిల్లా కేసముద్రంలో ఈ నెల 6వ తేదీన జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి కోసం తన తల్లిదండ్రులను కుమారుడు హత్య చేశాడు. కిరాయి వ్యక్తితో కలిసి కుమారుడు, కోడలు ఆ వృద్ధ దంపతులను హతమార్చారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అందించిన వివరాలు ప్రకారం - కేసముద్రం మండల కేంద్రానికి చెందిన గుడ్ల వెంకట్రామయ్య(75) మెదటి భార్య ప్రమీల 11 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి కుమారుడు కృష్ణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడికి, కుమార్తెకు వివాహం జరగడంతో వెంకట్రామయ్య ఒంటరితనాన్ని భరించలేక మరో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కుమారుడు, కూతుర్లు వద్దని వారించినా వినకుండా ఎనిమిదేళ్ల క్రితం జఫర్‌గడ్ మండలం కూనూర్‌కి చెందిన సరస్వతి(40)ని వివాహం చేసుకున్నాడు.

వివాహ విషయంలో తగాదాలు జరుగడంతో మండల కేంద్రంలో ఉన్న ఇంటి స్థలం, ఇల్లు కృష్ణ పేరు మీదకు మార్చాడు. అనంతరం వెంకట్రామయ్య, సరస్వతి దంపతులకు మూడేళ్ల క్రితం కుమారుడు జన్మించాడు. ఈ క్రమంలో మొదటి భార్య కుమారుడి కృష్ణతో ఆస్తి విషయంలో తగదాలు జరిగాయి.
దీంతో వెంకట్రామయ్య, సరస్వతి తమ కుమారుడు విష్ణుతో కలిసి కొద్దిరోజుల నుంచి కూనూరులో ఉంటూ అక్కడే నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నారు. ఏదో పనివిషయంలో వీరు ఈ నెల 5న కేసముద్రం వచ్చారు. ఈ నేపథ్యంలో వెంకట్రామయ్య, సరస్వతి హత్యకు గురై మృతి చెందడం స్థానికంగా కలకలాన్ని సృష్టించింది.












Click it and Unblock the Notifications