ఆ సత్తా సోనియాకే ఉంది: వెంకయ్య ప్రశంస, తప్పుదోవ: కిషోర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఏకీకృతం చేసే సత్తా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే ఉందని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అన్నారు. ఆమె లేకుంటే కాంగ్రెస్ పార్టీ పతనమై ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అధ్యక్ష పదవి అంశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహామని, తమకు సంబంధం లేదన్నారు. సోనియా వల్లే కాంగ్రెస్ పార్టీ ఏకీకృతంగా ఉందనేది తన అభిప్రాయమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వారసత్వం అనేది అనవసరమన్నారు. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మద్దతుదారులకే వారసత్వం నచ్చుతుందన్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు: కిషోర్ చంద్రదేవ్
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన వైఫల్యాల పైన సొంత పార్టీలోనే నిరసన గళం పెరుగుతోంది. అధిష్టానాన్ని కొందరు సీనియర్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత కిషోర్ చంద్రదేవ్ విమర్శించారు.
అలాంటి డజను మంది సీనియర్ నేతలను సెలవుల పైన పంపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ త్వరగా నిర్ణయం తీసుకోకుంటే ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పెరిగే అవకాశముందన్నారు. లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసి రెండేళ్లు గడుస్తున్నా పార్టీలో మార్పు లేదన్నారు.












Click it and Unblock the Notifications