తెలంగాణ తప్పలేదు, బాధపడ్డా: సోనియా, తెలుగులో..

గుంటూరు: సీమాంధ్ర ప్రాంత సమైక్యాంధ్ర స్ఫూర్తి తమకు తెలుసునని కానీ, తెలంగాణ ఇవ్వక తప్పలేదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. విభజన తర్వాత ఆమె తొలిసారి సీమాంధ్రకు వచ్చారు. సోదర, సోదరీమణులారా అంటూ ఆమె తెలుగులే ప్రసంగం ప్రారంభించారు. సభలో ఆమె మాట్లాడుతూ... విభజనపై నిర్ణయం తీసుకున్నప్పుడు తాను చాలా మానసిక వ్యధకు గురయ్యానని చెప్పారు.

ఒక్క సిపిఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు లేఖ ఇచ్చాకే తాము తెలంగాణ ఇచ్చామని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్రా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. విభజన పైన తాను సీమాంధ్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోగలనని చెప్పారు.

Sonia Gandhi speech in Guntur

గుంటూరుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించే నగరం గుంటూరు అన్నారు. సీమాంధ్రలో యువత ఉపాధి కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాదులోని ఆంధ్ర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. సీమాంధ్ర యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సీమాంధ్రుల ఇబ్బందులను తొలగించే అంశాలను బిల్లులో పొందుపర్చామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని, దాంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్ర యువత భవితకు తాను పూచి అని చెప్పారు. సీమాంధ్రకు పెట్రోలియం వర్సిటీ తదితరాలను తీసుకు వస్తామన్నారు.సీమాంధ్ర యువతుకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు.

సీమాంధ్రలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. విశాఖ, చెన్నై కారిడార్‌తో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. టిడిపి, బిజెపి తోడుదొంగలు అన్నారు. బిజెపి, టిడిపి పొత్తు అపవిత్ర కలయిక అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తాము కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్రలోని నగరాలను హైదరాబాద్‌ను తలదన్నేలా నిర్మిస్తామన్నారు. చాలా కాలం ఆలోచించాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. టిడిపి, బిజెపిలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివన్నారు. గుంటూరులో తన ప్రసంగం చివర్లో సోనియా గాంధీ జై సమైక్యాంధ్ర, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+